joint pain relief home remedies

కీళ్లు చేతులు వెన్ను మరియు మోకాళ్ళ నొప్పులు అన్ని పూర్తిగా మాయం

జీవనశైలిలో వచ్చిన మార్పుల వలన చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం, కీళ్ళనొప్పులు బారిన పడుతున్నారు. అలా బాధపడేవారు ఈ చిట్కాలతో షుగర్ను తగ్గించుకునే అవకాశం ఉంది. అలాగే కొంతమంది కీళ్ల నొప్పులు, కాళ్ల నొప్పులతో చాలా బాధ పడుతుంటారు. కీళ్ల నొప్పులు, మధుమేహానికి ఒకే జిల్లేడు ఆకు చాలా బాగా పనిచేస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఆ చిట్కా ఏంటో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.

 జిల్లేడులో మూడు రకాలు ఉన్నాయి. అందులో ఒకటి రాచ జిల్లేడు, రెండు ఎర్ర జిల్లేడు, 3 తెల్ల జిల్లేడు. ఇందులో ఎక్కువగా తెలుపు, ఎరుపు జిల్లేడు ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తూ ఉంటారు. తెల్ల జిల్లేడు ఎక్కువగా కనిపించదు.అందువల్ల  ఎర్ర జిల్లేడు కూడా ఉపయోగిస్తుంటారు. ఈ మొక్క వినాయకుడికి ఇష్టమైన మొక్కగా భావిస్తారు. ఈ మొక్క ఆకులు తీసినప్పుడు పాలు వస్తుంటాయి. అవి కంటికి తగలకుండా జాగ్రత్త పడాలి. వాటి వలన కంటి చూపు పోయే ప్రమాదం ఉంది.

 వీటి ఆకులను సేకరించి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మధుమేహం ఉన్నవారు ఈ ఆకులను అరకాళ్లకు పెట్టుకొని గట్టిగా కట్టాలి. అది ఉదయం వరకు అలానే ఉండాలి. ఆకుల పైన సాక్సులు ధరించడం వలన ఇంకా సులభంగా ఉంటుంది. ఇలా కనీసం 15 రోజుల పాటు ఉపయోగించిన తర్వాత రక్తపరీక్ష చేయడం వల్ల షుగర్ లెవెల్స్ తగ్గినట్లు గమనిస్తారు. ప్రతిరోజు కొత్త ఆకులను ఉపయోగించాలి.

 ఆకులను పైన భాగం బయటకు కనిపించే విధంగా కట్టాలి. అలాగే కీళ్ళ నొప్పులు ఉన్నవారుకి ఒక కలబంద కొమ్మ తీసుకోవాలి. దాని పక్కన ఉండే ముళ్ళు తొలగించి లోపల ఉండే గుజ్జు సేకరించాలి. దీనిని స్పూన్ తో మెత్తగా చేసుకోవాలి. దీనిలో స్పూన్ పసుపు వేయాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు జిల్లేడు ఆకులు తీసుకొని వాటికి నువ్వుల నూనె రాసి ఐరన్ ఫ్యాన్ తిరగేసి పెట్టుకోవాలి. దానిపై ఈ జిల్లేడు ఆకులను వేడి చేయాలి.

 వేడిగా ఉన్నప్పుడు కాళ్లకు కలబంద, పసుపు మిశ్రమాన్ని ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ బాగా మసాజ్ చేసి ఈ ఆకులను కట్టాలి. ఆకులు జరగకుండా దారంతో కట్టేయాలి. దానిమీద ఏదైనా బ్యాండేజ్ లేదా గుడ్డతో కట్టడం వలన ఆకులు కదలకుండా ఉంటాయి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వలన కీళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!