ప్రియమైన పాఠకులారా.. మనలో ఎముకల బలహీనతతో కీళ్లు మోకాళ్ళ నొప్పులతో నడవలేని పరిస్థితిలో ఉన్నారో, మెట్లు ఎక్కలేక పోవడం చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేకపోవడం అలాంటివారికి ఇప్పుడు చెప్పబోయే ఆయుర్వేద చిట్కా వాడటం కీళ్ల నొప్పులు ఖచ్చితంగా తగ్గుతాయి. మీ శరీరంలో ఎముకలకు సంబంధించిన ఎటువంటి బలహీనతను దూరం చేసి మిమ్మల్ని తిరిగి ఆరోగ్యంగా పూర్వ స్థితికి తీసుకువస్తుంది.
ఈ రెమిడీ ద్వారా మీ శరీరంలో క్యాల్షియం లోపాన్నే కాదు ఎముకల మధ్యలో పేరుకుపోయిన వాతంతో పాటు మన శరీరంలోని ఎన్నో రకాల సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఈ రెమిడి ఎలా తాయారు చేసుకోవాలో ఎలా వాడాలో ఈ క్రింది వీడియో చూసి తెలుసుకోండి.
రెమెడీ తయారీ విధానం
ముందుగా గ్యాస్ ఆన్ చేసి స్టౌ మీద ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టండి. ఇందులో నాలుగు లేదా ఐదు స్పూన్ల వంట నూనెను వేయండి. తర్వాత ఇందులో రెండు స్పూన్ల మోతాదులో బబుల్ గొంద్ (babul gond) లేదా గొంద్ కటీరా (gond katira) వేసుకోవాలి. ఇవి మీకు ఏదేని సూపర్ మార్కెట్ లో లేదా ఆయుర్వేద షాప్ లో దొరుకుతాయి. రెండు నుంచి మూడు నిమిషాలు తక్కువ మంటలో వీటిని నూనెలో ఫ్రై చేయండి. తర్వాత వీటిని పక్కకు తీసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేయండి.
ఈ డ్రింక్ ఎప్పుడు తాగాలంటే ..
ముందుగా ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తీసుకొని ఇంతకుముందు ఫ్రై చేసుకుని పొడి చేసుకున్న గోంద్ పొడిని ఇందులో ఒక స్పూన్ మోతాదులో కలపండి. మీరు ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ డ్రింక్ తీసుకోవాలి. ఈ డ్రింకులు పెద్దల నుండి పిల్లల వరకు ఎవరైనా త్రాగవచ్చు. ప్రసవం తర్వాత మహిళలో క్యాల్షియం లోపం ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఈ డ్రింక్ తాగించడం వలన వాళ్లలో క్యాల్షియం డెఫిషియన్సీ సమస్య రాదు.
బబుల్ కటీర లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. కాల్షియం మన శరీరంలో ఎముకలు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తొలగించి మన ఎముకలు ఉక్కులా గా పటిష్టంగా మారుస్తుంది. అంతేకాదు బబుల్ గొంద్ మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ల నొప్పులు మెడ నొప్పి వెన్ను నొప్పి లాంటి ఎన్నో రకాల సమస్యలను కూడా తగ్గిస్తుంది.