joint pain remedies homeopathy

కేవలం రెండుసార్లు రాసుకుంటే చాలు…. కీళ్లు, మోకాళ్ళు, వెన్ను నొప్పులు మాయం…..

ఈ కాలంలో ఎక్కువగా అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం కీళ్లు, మోకాలు, వెన్ను నొప్పులు ఈ వేసవి కాలంలో ఇటువంటి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఇప్పుడు తయారు చేసుకునే రెమిడి ఇటువంటి వాటికి బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, కాళ్లవాపులు నుంచి విడుదల పొందవచ్చు. అంతేకాకుండా ఒక్కసారి ఈ రెమిడి నీ తయారు చేసుకుంటే మూడు నుంచి 7 రోజుల పాటు నిల్వ ఉంచుకోనీ ఉపయోగించుకోవచ్చు. ఈ రెమిడి కోసం మనకు కావలసిన పదార్థాలు,ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం.

దీని కోసం ముందుగా ఒక స్టెమ్ కలబందను తీసుకోవాలి. దీనిని బాగా శుభ్రం చేసి సైడ్ ముల్లును తోలగించీ మధ్యలో ఉన్న గుజ్జును తీసి ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి దానిలో రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వుల నూనెను వేసుకొని స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన మిశ్రమంలో ఒక టీస్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ పై సన్నని మంట పై పెట్టుకొని బాగా దగ్గరకు అవ్వనివ్వాలి. ఇలా స్టవ్ పై ఉన్నప్పుడు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఈ రెమిడి తయారవుతుంది. దీనిలో నువ్వుల నూనెకు బదులు ఆవాల నూనె కూడా ఉపయోగించుకోవచ్చు.

ఈ మిశ్రమము ఉపయోగించే ముందు నొప్పిగా ఉన్న చోట ముందుగా నువ్వుల నూనెతో బాగా రెండు నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తరువాత ఒక స్పూన్ తో కొంచెం మందంగా ఒక ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఇలా ఒక రెండు గంటల పాటు ఉంచుకొని ఆ తరువాత అదే స్పూన్ తో నీట్గా తీసివేయాలి. ఆ తర్వాత వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఇలా రాత్రి పడుకునే ముందు చేసుకోవాలి. ఒకవేళ రాత్రి మొత్తం ఉంచుకోవాలి అనుకుంటే దానిపై ఆముదం ఆకును ఒక తాడు సహాయంతో కట్టుకోవాలి. తర్వాత రోజు నీటుగా శుభ్రం చేసుకోవాలి.

ఇలా 3 రోజులపాటు చేస్తే నొప్పుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది. నువ్వుల నూనెను ఉపయోగించడం ద్వారా దానిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి మరియు ఎముకలకు మంచి బలం చేకూరుతుంది. పసుపులో యాంటీబ్యాక్టీరియల్ స్వభావం వలన చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కూడా విడుదల పొందవచ్చు. ఈ ప్యాక్ ను మూడు రోజుల ఉపయోగించిన తర్వాత ఉపసమయం కలిగితే మరల తయారు చేసుకొని మరల మూడు రోజులు పాటు ఉపయోగించుకోవాలి….

Leave a Comment

error: Content is protected !!