జుట్టు రాలడం సమస్య ప్రతి ఒక్కరిని చాలా ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. మీరు రకరకాల ఆయిల్స్, హెయిర్ ప్యాక్స్ ట్రై చేసి విసిగిపోయిన వారు ఒకసారి ఈ ప్యాక్ ట్రై చేయండి. జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ తయారుచేసుకోవడానికి మందార ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. మందార ఆకులు కెరోటిన్ అధికంగా కలిగి ఉంటుంది.
ఇది జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడంలో సహాయపడుతుంది. మందార ఆకులు జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుంది. చివర్లు చిట్లడం వంటి సమస్యలు తగ్గుతాయి.ఈ హెయిర్ ప్యాక్ కోసం ఒక గుప్పెడు మందార ఆకులను తీసుకోవాలి. తర్వాత ఒక అర గుప్పుడు కరివేపాకు తీసుకోవాలి. కరివేపాకు జుట్టుకు టానిక్ లాగా పనిచేస్తుంది. కరివేపాకు బేటా కెరోటిన్ కలిగి ఉంటుంది. జుట్టు కుదుళ్లు బలంగా చేసి జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గిస్తుంది.
రాలిన ప్రతి వెంట్రుక రావడంలో కరివేపాకు సహాయపడుతుంది.కలబంద మట్ట ఒకటి తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. కలబంద జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది. జుట్టుకు కండిషనర్ లాగా పని చేస్తుంది. రెండు లేదా మూడు మందారపువ్వులు తీసుకోవాలి జుట్టు రాలడం తగ్గించి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతాయి.
జుట్టు మృదువుగా, నల్లగా చేయడంలో మందార పూలు ఉపయోగపడతాయి. వీటన్నిటిని కలిపి రెండు లేదా మూడు చెంచాల నీళ్లు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ప్యాక్ లో మీరు రెగ్యులర్ గా ఉపయోగించే ఏదైనా హెయిర్ ఆయిల్ ఒక చెంచా కలుపుకోవాలి. చాలామందికి డౌట్ ఉంటుంది ఈ ప్యాక్ ను నూనె తలకు పెట్టుకోవచ్చా లేదా అని. ఎలాంటి ఇబ్బంది లేదు నూనె తలకు లేదా డ్రై హెయిర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు అప్లై చేసి 30 నిమిషాల ఉండనివ్వాలి.
తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూ లేదా హోం మేడ్ షాంపూ తోతలస్నానం చేసినట్లయితే జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా జుట్టుకు కండీషనర్ చేయడంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఈ ప్యాక్ జుట్టును నల్లగా, మృదువుగా తయారు చేస్తుంది. ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉపయోగించినట్లయితే తేడా మీరే గమనిస్తారు.