korean Lip Peel off Mask

ఎంత నల్లటి పెదాలైన ఈ మాస్క్ వేస్తే పింక్ రంగులోకి మారతాయి

 అందరూ ముఖంలో పెదాలు అందంగా కనిపించడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ కొంతమందికి పొట్టు రాలడం, నల్లగా అయిపోవడం,  డ్రై పోవడం, పగుళ్లు రావడం, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు ఉంటాయి. మనం మార్కెట్లో దొరికే లిప్స్టిక్ లను ఉపయోగించడం వలన కూడా పెదాలపై ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ పీల్ ఆఫ్ మాస్క్  ట్రై చేసినట్లయితే ఈ సమస్య తగ్గి పెదాలు అందంగా  తయారవుతాయి. గులాబీ రంగులోకి మారతాయి. ఈ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

       ఒక  బీట్ రూట్ తీసుకొని  పీల్ చేసుకొని   గ్రేటర్ సహాయంతో మెత్తగా తురుముకోవాలి. తురుముకున్న   తురుము నుండి  స్ట్రైనర్ సహాయంతో వడకట్టుకుని జ్యూస్  తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా కాఫీ పౌడర్ ను వేసుకోవాలి. బీట్ రూట్ జ్యూస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తరువాత దీనిలో మార్కెట్లో దొరికే పీల్  ఆఫ్ మాస్క్ తెచ్చుకొని ఒక స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. మీరు లిప్స్టిక్ కానీ ఇబ్బంది కానీ అప్లై చేసుకున్నట్లయితే అది  రిమూవ్ చేసుకోవాలి. తర్వాత ఈ  మాస్క్ పెదాలపై అప్లై చేసుకోవాలి. 

      ఆరడానికి 10-15 సమయం పడుతుంది.  ఆరేవరకు ఉండనివ్వాలి. ఆరిన తర్వాత ఈ ప్యాక్  తీసేయకుండా సెకండ్ కోట్ వేసుకోవాలి. సెకండ్ కోట్  కొంచెం మందంగా అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత పీల్ ఆఫ్ మాస్క్ను నెమ్మదిగా రిమూవ్ చేసుకోవాలి.  ఈ మాస్క్ వేసుకోవడం వలన పెదాల పై ఉండే డెడ్ స్కిన్ సెల్స్, డ్రై అవ్వడం, పగిలిపోవడం, పిగ్మెంటేషన్, నల్లగా అవ్వడం వంటి సమస్యలు తగ్గుతాయి. పెదాలు గులాబీ రంగులోకి మారతాయి. ఈ ప్యాక్ కోసం  లిప్స్టిక్  కొనడానికి అయ్యే ఖర్చు కూడా అవ్వదు.

        మార్కెట్ లో 5 లేదా 10 రూపాయలలో పీల్ ఆఫ్ మాస్క్ లు లభిస్తాయి.  కాబట్టి చాలా తక్కువ ఖర్చు లోనే మీ పెదాలు గులాబి రంగు లోకి మార్చుకోవచ్చు. ఈ ప్యాక్ను వారానికి ఒకసారి వేసుకున్నట్లయితే సరిపోతుంది. దీనిని ఉపయోగించడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ మాస్క్ వేసుకుంటే మనం బయట మార్కెట్లో దొరికే మాస్క్  వేసుకున్నట్లే అనిపిస్తుంది. ఈ మాస్క్ ఉపయోగించడం వల్ల మీ పెదాలు చాలా మృదువుగా మారతాయి. 

      పెదాలు ఎర్రగా అవడం లో ఎక్కువగా ఉన్నాయి అనుకున్నవారు ఈ మాస్క్ వేసుకోవడానికి ముందు ఒక చెంచా బీట్రూట్ జ్యూస్తో ఒక చెంచా పంచదార కలిపి   పెదవులకు అప్లై  చేసి స్క్రబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్  రిమూవ్ అవుతాయి. బీట్రూట్ బదులుగా క్యారెట్ లేదా టమోటో కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ చర్మం  మరియు పెదవుల రంగును మెరుగుపరచడంలో బీట్ రూట్ చాలా బాగా సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!