జుట్టు నల్లగా మారడానికి జుట్టు సమస్యలు తగ్గడానికి ఆయుర్వేద పద్ధతిలో తయారు చేసిన నూనె చాలా మంచి ఫలితాలను అందిస్తూ ఉంటుంది. దాని కోసం మనం ఆవ నూనె తీసుకోవాలి. ఆవనూనె తలలో ఉండే చర్మ ఇన్ఫెక్షన్లను, చుండ్రు, జుట్టు సమస్యలను తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తుంది. ఆవనూనె ఆహారంలో తీసుకోవడం వలన అనేక రకాల నొప్పులను తగ్గించుకోవచ్చు. ఎన్నో ఆయుర్వేద లక్షణాలు ఉన్న ఆవనూనె తలకు ఉపయోగించడం వలన తెల్లజుట్టు సమస్య తగ్గించుకునేందుకు సహాయపడుతుంది.
స్టవ్ మీద ఒక ఇనుప కడాయి పెట్టుకుని దానిలో మనం చేయాలి అనుకున్నంత మోతాదులో ఆవ నూనె వేసుకోవాలి. ఒక లీటర్ నూనెకు నాలుగు స్పూన్ల మెంతులు, నాలుగు స్పూన్ల కలోంజి విత్తనాలు వేసుకోవాలి. దీనిలో ఒక మూడు స్పూన్ల మంచి హెన్నా పౌడర్ కూడా వేసుకోవాలి. మెంతులు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది అని మనందరికీ తెలిసిందే. అలాగే మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుంది. కలోంజి విత్తనాలు జుట్టు కుదుళ్ల నుంచి బలంగా చేయడానికి జుట్టు నల్లగా మారడానికి జుట్టు పెరుగుదల మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది.
ఎన్నో జుట్టు పెరుగుదలకు జుట్టు సమస్యలకు సహాయపడుతుందని ఉపయోగించే ప్రతి ఒక్కరికి తెలుసు. జుట్టు మృదువుగా చేయడంలో పొడవుగా పెరిగేందుకు సహకరిస్తుంది. ఇప్పుడూ నూనె బాగా మరిగి నల్లగా తయారయ్యే అంతవరకు మరిగిస్తూ కలుపుతూ ఉండాలి. తర్వాత స్టౌవ్ ఆపేసి నూనెను చల్లారనివ్వాలి. నూనె చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో కి వడకట్టుకోవాలి. ఈ నూనె 2 నెలల వరకు నిల్వ ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్లో నిల్వ చేయకూడదు. అలా చేయడం వల్ల రసాయనిక చర్య జరిగే అవకాశం ఉంటుంది.
ఈ నూనెను తలలో ఉన్న తెల్ల వెంట్రుకలను బట్టి ఉపయోగించాలి. ఎక్కువగా తెల్లజుట్టు సమస్య ఉన్నవారు ఎక్కువ రోజులు ఉపయోగించాలి. వారానికి రెండు మూడు సార్లు ఉపయోగించాల్సి ఉంటుంది. తక్కువ తెల్లజుట్టు సమస్య ఉన్నవారు తక్కువ వారాల పాటు ఉపయోగిస్తే జుట్టు నల్లగా అవుతుంది. కొన్ని వారాలపాటు ఉపయోగించడం వలన ఫలితం కనిపిస్తుంది. ఈ నూనెను తలకు అప్లై చేసిన తర్వాత మరుసటి రోజు తలస్నానం చేయవచ్చు. ప్రకృతి సహజమైన పదార్థాలతో తయారు చేసిన నూనె ఉపయోగించడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా జుట్టు పెరుగుదలను కూడా పెంచుకోవచ్చు.