Lotus Seeds Health Benefits Phool Makhana Health Benefits in Telugu

పూల్ మఖనా ఎపుడైనా తిన్నారా?? వాటిలో ఆరోగ్య రహస్యం తెలిస్తే వెంటనే తినడం మొదలుపెడతారు!!

పూల్ మఖనాగా పిలుచుకునే తామర గింజల్లో ప్రోటీన్లు మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి, కొవ్వు తక్కువగా ఉంటుంది.  అలాగే కాల్షియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీటిలో మెగ్నీషియం, పొటాషియం మరియు భాస్వరం కూడా మంచి మొత్తంలో ఉంటాయి.  తక్కువ పరిమాణంలో కొన్ని విటమిన్లు కూడా మఖానాలో ఉన్నాయి. 

 పూల్ మఖనా( తామరగింజలు) ఆరోగ్య ప్రయోజనాలు:

◆ వీటిలో  ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది.  అందువల్ల ఉపవాసం చేసేవారు వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు.  యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నందున వీటిలో గొప్ప యాంటీ ఏజింగ్ ప్రభావం ఉంటుంది. ఇది యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు వీటిని తీసుకోవడం వల్ల చర్మం నిగారింపును, ఆరోగ్యాన్ని సంతరించుకుంటుంది. 

◆ మధుమేహ వ్యాధిగ్రస్తులకు మరియు గుండె జబ్బు సమస్యలు ఉన్నవారికి ఇవి  గొప్ప అల్పాహారం గా ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో మంచి కొవ్వు నిల్వలు ఉంటాయి అవి కూడా తక్కువ పరిమాణంలో సంతృప్త కొవ్వులు అవడం వలన వీటిని తీసుకుంటే బరువు తగ్గాలని అనుకునేవారు సులువుగా బరువు తగ్గుతారు.   

◆ వీటిలో  ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఈ ఫైబర్ జీర్ణ ప్రక్రియను సమర్థవంతంగా ఉంచుతూ మలబద్దకాన్ని నివారిస్తుంది. .

◆  శరీరం నుండి విషాన్ని బయటకు పంపడంలో ఇవి  ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఎర్ర రక్తకణాలను రీసైకిల్ చేయడం ద్వారా రక్త వ్యవస్థను సమర్థవంతంగా ఉంచడంలో దోహాధం చేస్తుంది. అలాగే ప్లీహన్ని ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.   

◆  వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. అంటే అవి రక్తంలో గ్లూకోజ్‌ను నెమ్మదిగా విడుదల చేస్తాయి.  దీనివల్ల ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది. 

◆ గోధుమ లో ఉన్న గ్లూటెన్ కొందరికి ఒంటదు. అలాంటి వారు ప్రత్యమ్నాయంగా వీటిని తీసుకోవడం వల్ల కార్బోహైడ్రేట్స్ కావాల్సిన మోతాదులో పొందవచ్చు.

◆ వీటిలో మెగ్నీషియం మరియు పొటాషియం అధికంగా ఉంటాయి అలాగే  సోడియం తక్కువగా ఉంటుంది.   అధిక పొటాషియం మరియు తక్కువ సోడియం వల్ల రక్తపోటుతో బాధపడుతున్న  వారికి గొప్ప ప్రత్యామ్నాయం.  పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది మరియు సోడియం దానిని సమతుల్యతగా ఉంచడంలో దోహాధం చేస్తుంది.  కాబట్టి అధిక రక్తపోటుతో బాధపడేవారు బిపి ని కంట్రోల్ లో ఉంచుకోడానికి వీటిని తీసుకోవడం మంచిది.

◆శరీరంలో మంటను తగ్గించే కెంప్పెరోల్ వీటిలో సహజంగా లభ్యమవుతుంది. అలాగే డయాబెటిస్, ఆర్థరైటిస్, రుమాటిజం వంటి చాలా వ్యాధులకు వాపు కారణమవుతుంది ఈ వాపును తగ్గించడంలో ఇవి సమర్థవంతంగా పని చేస్తాయి.  

చివరగా…..

పూల్ మఖనా  అని పిలుచుకునే తామర గింజల్లో యాంటీ బయటిక్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి పైన చెప్పుకున్న ఫలితాలతో పాటు రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. మరి లేటెందుకు వెంటనే తెచ్చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!