male infertility ayurvedic treatment

మగవాళ్ళలో సంతానలేమి సమస్యకు ఎన్ని కారణాలు ఉన్నా ఇవి పాటిస్తే చాలు సమస్య పరిష్కారం అవుతుంది!!

పిల్లలు పుట్టకపోవడానికి మహిళలే కాదు, మగవాళ్ళు కూడా కారణం అవుతుంటారు. అవును మరి మహిళల్లో గర్భాశయ దోషాలు ఉన్నట్టే, మగవాళ్ళలోనూ స్పెర్మ్ లో శుక్రకణాల కౌంట్ తక్కువగా ఉండటం లేదా సరిగా స్పెర్మ్ ఉత్పత్తి కాకపోవడం వంటివి జరుగుగూ ఉంటాయి. వీటికి కారణాలు ఏమిటి అంటే అధిక వేడి.  ఆ మధ్య న్యూయార్క్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ వారు “రెఫ్రిజరేటెడ్ అండర్వేర్”ని ప్రత్యేకంగా తయారు చేశారట. వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది కానీ నిజం. పురుషుల్లో వృషణాల లోపల అధిక వేడికి వారి వీర్యంలో శుక్రకణాలు నశించిపోతుండటం పిల్లలు కలగక పోవడానికి ముఖ్య కారణం.

సంతానం లేని మగవారిలో వీర్యాన్ని పరీక్షించినప్పుడు, శుక్రణాల ఉత్పత్తి సరిగానే జరుగుతున్నా వాటి జీవిత కాలం స్వల్పంగా వుండి, త్వరగా చనిపోవడం వలన ఆ వ్యక్తి సంతానోత్పత్తి చేయలేకపోతున్నాడనేది నిపుణులు గ్రహించిన నిజం.  ఇలాంటి పరిస్థితి ఉన్నవారికి స్వతహాగా శరీరాన్ని చల్లబరిచి ఆరోగ్యంగా అవ్వాలి కాని తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చే రిఫ్రిజిరేటర్ అండర్వేర్ లు లాంటివి తగినవి కాదు. మరి స్వతహగ శరీరాన్ని చల్లబరిచి వీర్యంలో శుక్రకణాల నష్టం లేకుండా ఉండాలంటే ఎలా??

ఆయుర్వేదంలో వృషణాలలో వేడిని తగ్గించి చలవని కల్గించే అద్భుత ఔషధాలున్నాయి.

స్వర్ణవంగభస్మ, త్రివంగభస్మ, రజత చంద్రోదయం, శతావరికల్పం, బూడిద గుమ్మడి రసం, కూష్మాండ రసాయనం, ఆమల రసాయనం, అరటిపండు, బాలింత బోలు, ముల్లంగి జ్యూస్ తీసుకొని తాగడం, మంచి గంధం, వేపపళ్ళు ఇలాంటి అనేక ద్రవ్యాలు వీర్యానికి చలవని కల్గించేవిగా ఆయుర్వేద శాస్త్రంలో పేర్కొనబడింది.

ఇవన్నీ చాలా తేలికగా, చవకగా దొరికేవే. వేడి చేసిందని అపించినప్పుడు నీళ్ళ తొట్టిలో కూర్చోవడం కన్నా, చలవచేసే పదార్థాలను తినడం మంచిది కదా! తర్బూజా పండు వేసవిలో ఎంతో మంది ఫెవేరేట్. ఈ పండు పైన పొట్టు తీసి ముక్కలుగా చేసి ఆ ముక్కలలో పంచదార వేసుకొని తినడం వలన చలవచేస్తుంది. సొరగింజలు, గుమ్మడి గింజలు, దోసగింజలు కూడా వీర్యానికి చలవని, మరియు శక్తిని కూడా ఇస్తాయి.

కొందరిలో లైంగిక క్రియ జరిపేటప్పుడు వీర్యాన్ని వదిలితే,  స్త్రీకి భరించలేనంత వేడీ మంట పుడుతూ వుంటుంది. అంటే పురుషుల్లోని అతి వేడి వల్ల వీర్యం చాలా వేడిగా విడుదల అయి ఉంటుంది. అలాంటప్పుడు కూడా ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. ఏమీ దొరకకపోతే బూడిద గుమ్మడి కాయ ఒక్కటి ఉన్నా చాలు. హల్వా చేసుకొని తింటే అద్భుతమైన రుచి, శరీర వేడిని చిటికెలో తగ్గించి అమితమైన చలవ చేస్తుంది.!!

అంతేకాదు మగవాళ్ళు ఎక్కువగా వేసుకునే ఫాంట్ పాకెట్ ల లోనే మొబైల్ ఫోన్ లు ఎక్కువగా పెట్టుకోవడం, బైక్ లో ఎక్కువగా తిరగడం వంటివి కూడా కారణాలే. సెల్ టవర్ రేడియేషన్ వల్ల పక్షులు ఎలా మరణిస్తున్నాయో మొబైల్ రేడియేషన్ వల్ల  మగవాళ్ళ వీర్యంలో శుక్రకణాలు అలాగే నశించిపోతున్నాయ్. 

చివరగా….

పైన చెప్పుకున్న విధానాన్ని బట్టి మగవాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకుంటే తండ్రి కావడం పెద్ద కష్టం ఏమి కాదు.

Leave a Comment

error: Content is protected !!