ఒకరి మరణం మరొకరికి జీవితం కావచ్చు లేదా ఒకరి నిర్లక్ష్యం మరొకరికి మరణం కూడా కావచ్చు. అలాంటి రెండు సంఘటనల గురించి తెలుసుకుందాం. తమిళనాడులోని థాని జిల్లాకు చెందిన ఒక స్త్రీకి ఆరవ నెలలో పురిటినొప్పులు రావడంతో హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆమెకి నొప్పులు ఎక్కువ అవడంతో సిజేరియన్ డెలివరీ చేసి బిడ్డను తీసిన తర్వాత ఆ బిడ్డలో ఎటువంటి కదలికలు లేకపోవడంతో బిడ్డ మరణించిందని తల్లిదండ్రులకు అప్పగించారు డాక్టర్లు. ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ చనిపోయిన బిడ్డను స్మశానానికి తీసుకుని వెళ్లారు.
అయితే మనం చేసే సమయంలో ఆ బిడ్డ కదలడంతో వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్లు సరిగ్గా పరిశీలించకుండా బిడ్డ చనిపోయిందని చెప్పడం వలన ఒక బిడ్డ తన ప్రాణాలను కోల్పోయేది. ఆ విషయం తెలుసుకున్న హాస్పిటల్ చీఫ్ మొదట ఆ బిడ్డను పరీక్షించిన డాక్టర్లు, నర్సులను విచారించేందుకు ఆదేశించారు. ఒక్కోసారి మనం దేవుడిగా భావించే డాక్టర్లలో కూడా నిర్లక్ష్యంగా తమ పని చేసేవారు ఉన్నారు. అలాగే కష్ట సమయాల్లో రోగుల కోసం సమయాసమయాలు చూడకుండా నిద్ర కూడా త్యాగం చేసి తమ సేవలను అందించేవారు ఉన్నారు.
అలాగే మరొక బిడ్డ విషయంలో జరిగిన సంఘటన అందరినీ కదిలించింది. 20 నెలల కనిష్ట అనే పాప ఆ ఇంట్లో అందరికీ ప్రాణప్రదం. అందరూ ఆ చిన్ని పాపని చూసి మురిసిపోయేవారు. అయితే అనుకోకుండా ఆ పాప బాల్కనీ నుండి కింద పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్ కి తరలించినా కూడా ఆ పాప వారికి దక్కలేదు. బ్రెయిన్డెడ్ అవడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అయితే వారు హాస్పటల్లో ఉన్న సమయంలో చాలామంది అవయవాల కోసం ఎదురుచూస్తున్నట్టు గమనించి పాప తండ్రి తన బిడ్డ అవయవాలను వారికి దానం చేశారు.
పాప రెండు కార్యాలను కిడ్నీలను లివర్ను ఐదుగురికి దానం చేసి వారి ప్రాణాలను కాపాడారు. సమయానికి ఆ పాప అవయవాలు ఆమె తల్లిదండ్రులు అవయవ దానం చేయడం వలన ఐదుగురి ప్రాణాలు కాపాడినట్టు డాక్టర్లు కూడా చెబుతున్నారు. ఇప్పటికీ చాలామంది అనేక అపోహలతో అవయవ దానం చేయడానికి ముందుకు రారు. కానీ మనం ఈ లోకంలో లేకపోయినా తన అవయవాలను దానం చేయడం వలన మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చు.
I would like to donate my eyes after my death…