కామెర్ల గూర్చి సామెతలే ఊడిపడ్డాయ్. జాగ్రత్తలు తీసుకుంటే ఎంత తొందరగా తగ్గిపోతుందో నిర్లక్ష్యం చేస్తే ప్రాణాన్ని కూడా సులువుగానే లాక్కెళ్లిపోతుంది ఈ కామెర్ల రోగం. కళ్ళు, గోర్లు, శరీరం పచ్చగా మారిపోయి నీరసం, దాహం, ఆహారం వంటకపోవడమనే సమస్యతో మనిషిని నిలువెల్లా కబళిస్తుంది ఈ కామెర్ల రోగం. అసలు ఈ కామెర్లు ఎందుకొస్తున్నాయ్ అని పరిశీలిస్తే శరీరంలో వాత, పిత్త, కఫ దోషాలలో పిత్తము విపరీతంగా పెరిగిపోయి అది శరీరమంతా వ్యాపించడం వల్ల ఈ కామెర్ల జబ్బు వస్తుంది.
ఈ సమస్య వచ్చినా వారికి అన్ని వస్తువులు పసుపు పచ్చగా కనిపించడం, మలబద్దకం ఏర్పడటం, మూత్రం పచ్చగా రావడం, కొంతమందికి శరీరమంతా విపరీతమైన దురద, నోరు చేదుగా మారి, నాలుక పొరలు కట్టి కడుపులో వికారం గా ఉండటం వంటి సమస్యలు ఉంటాయి.
కామెర్లు తగ్గించే చిట్కాలు
◆ ఉత్తరేణి చెట్లు అన్నిరకాల నీరు పారే ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ ఆకులు తెచ్చి రసాన్ని తీసి పది గ్రాముల రసాన్ని పెరుగులో కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే కామెర్ల వ్యాధి తగ్గుతుంది.
◆ త్రిఫల చూర్ణాన్ని నీళ్లలో వేసి రాత్రి మొత్తం అలాగే ఉంచి రోజూ రెండు పూటలా తాగడం వల్ల శరీరంలోని త్రిగుణాలు క్రమబద్దం అవుతాయి. దీనివల్ల కామెర్లు తగ్గుతాయి.
◆ ఆవాలు, పటిక బెల్లం( కలకండ) తీసుకుని రెండు కలిపి మెత్తగా దంచాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు భాగాలుగా చేసి ఒకో భాగాన్ని ఒకో మాత్ర గా తయారుచేయాలి. ఈ నాలుగు మాత్రలను రోజు పూటకు ఒకటి చెప్పున రెండు పూటలా అరటిపండులో పెట్టి తీసుకోవాలి. ఇలా చేస్తే కేవలం మూడే రోజుల్లో కామెర్లు పారిపోతాయ్.
◆ నేల ఉసిరి వర్షాకాలంలో ప్రతి ఇంటి చుట్టూ మట్టి ఉన్న ప్రాంతాల్లో పెరుగుతుంది. చాలా మందికి పరిచయం ఉన్న మొక్క ఇది. ఈ నేల ఉసిరి మొక్కలు వేర్లతో సహా తీసుకుని శుభ్రం చేసి దంచి రసం తీసుకోవాలి.ఈ రసాన్ని 20 గ్రాములు, శొంఠి పొడి 2 గ్రాములు కలిపి రోజూ తీసుకుంటే కామెర్ల వ్యాధి చాలా వేగంగా తగ్గిపోతుంది.
◆ తిప్పతీగ రసం, ఆవు మజ్జిగ రెండు కలిపి ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
◆ మాను పసుపు అన్నిరకాల ఆయుర్వేద దునుసులు అమ్మే అంగళ్లలో దొరుకుతుంది. ఈ మాను పసుపు దంచి పొడి చేసుకుని గ్లాసుడు నీళ్లలో 10 గ్రాముల పసుపు వేసి పావు వంతు నీళ్లు మిగిలేవరకు మరగబెట్టి కషాయం తయారు చేయాలి. 30 గ్రాముల ఈ కషాయానికి 20 గ్రాముల తేనె కలిపి రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేస్తే అన్నిరకాల కామెర్ల వ్యాధులు తగ్గిపోతాయి.
చివరగా……
పైన చెప్పుకున్న ఆయుర్వేద చిట్కాలు పాటిస్తూ ఆహారం తీసుకునే విషయం లో కూడా జాగ్రత్తగా ఉంటే కామెర్ల వ్యాధులు చాలా సులువుగా తగ్గిపోతాయి.