Natural remedies and supplements for amenorrhea

ఈ డ్రింక్ తాగినట్లయితే 30 నిమిషాల్లో పీరియడ్స్ వచ్చేస్తాయి

ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు ఆహారపు అలవాట్ల వల్ల ప్రతి ఒక్కరికి అధిక బరువు, పిసిఓడి వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యలను తగ్గించుకోవడం కోసం హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. మందులు ఎన్ని ఉపయోగించినప్పటికీ ప్రయోజనం ఉండట్లేదు. అనేక సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నాచురల్ పద్ధతిలో పీరియడ్స్ 30 నిమిషాల్లో వచ్చే చిట్కా ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ  డ్రింక్ చేసుకొని తాగినట్లయితే తాగిన ముప్పై నిమిషాలకి పీరియడ్స్ వచ్చేస్తాయి. 

    పీసీఓడీ, అధిక బరువు వల్ల కొందరికి రెండు నెలలు, మూడు నెలల కొకసారి లేదా నెల దాటిన తర్వాత  పీరియడ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది ఇంట్లో పూజలు లేదా  శుభకార్యాలు ఉన్నాయని  కొంచెం లేటుగా రావడం కోసం టాబ్లెట్స్ ను ఉపయోగిస్తారు.  ఈ టాబ్లెట్స్ ఉపయోగించడం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఈ డ్రింక్ తయారు చేసుకొని ఉదయాన్నే  పరకడుపు తీసుకొన్నట్లైతే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వెంటనే పీరియడ్స్ వస్తాయి.  దీని కోసం ముందుగా ఒక గిన్నెలో 200 ఎంఎల్ వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్  ఆన్ చేసుకోవాలి.

      తర్వాత  నీళ్ళు కొంచెం మరుగుతున్నప్పుడు ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా జీలకర్ర వేసి పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. ధనియాలు, జీలకర్రలో వుండే పోషకాలన్నీ నీటిలోకి వచ్చేంతవరకు మరగనివ్వాలి. తర్వాత దీనిలో రెండు చెంచాల బెల్లం వేసుకొని ఇంకొక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి. పది నిమిషాలు మరిగిన తరువాత స్టవ్ లో  ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈ నీటిని గోరువెచ్చగా ఉన్నప్పుడు వడ కట్టుకొని ఒక గ్లాస్ ఉదయాన్నే పరగడుపున తాగాలి.

       ఈ నీటిని మరీ వేడిగా తాగకూడదు. అలాగని చల్లగా అయిపోయిన తర్వాత కూడా తాగకూడదు. మనం తాగడానికి సరిపడ వేడి ఉన్నప్పుడు మాత్రమే తాగాలి. ఈ డ్రింక్ ను ఎప్పుడు పడితే అప్పుడు తాగకూడదు. ఉదయాన్నే పరగడుపున మాత్రమే తీసుకోవాలి. నెలసరి రెండు మూడు రోజులు ముందు రావాలి అనుకున్న వారు ఈ డ్రింక్  తాగిన అరగంటలో నెలసరి వస్తుంది. తాగిన తర్వాత 45 నిమిషాల వరకు ఏమి తినకూడదు. 2 నెలలకొకసారి, మూడు నెలలకు ఒకసారి నెలసరి వచ్చే వాళ్ళు  వరుసగా మూడు రోజులపాటు ఈ డ్రింక్ ను ఉదయాన్నే పరిగడుపున తీసుకోవడం వలన నాలుగవ రోజు నెలసరి వస్తుంది. అంతే కాకుండా ఈ డ్రింక్ బ్లడ్ ప్యూరిఫికేషన్ లో చాలా బాగా సహాయపడుతుంది.

Leave a Comment

error: Content is protected !!