natural remedies to cure thyroid

ఒక స్పూన్ఎలాంటి థైరాయిడ్ అయినా మాయం చేసే రెండు రెమిడీలు

చదువులు, ఉద్యోగాలు అంటూ బిజీ బిజీ లైఫ్ లో విపరీతమైన టెన్షన్ లు అనేక రకాల అనారోగ్యాలకు కారణం అయితే వాటితో పాటు స్త్రీలలో డెలివరీ తర్వాత గర్భవతి సమయంలో, పీరియడ్స్ సమస్యలు వలన శరీరంలో హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు స్త్రీలలో ఎక్కువగా థైరాయిడ్ సమస్య కూడా కనిపిస్తుంది. థైరాయిడ్ మగవారిలో కూడా ఉన్న స్త్రీలలో ఎక్కువ శాతం కనిపిస్తుంది. థైరాయిడ్ హార్మోన్ తక్కువగా విడుదల అయినప్పుడు థైరాయిడిజం అంటే హార్మోన్ ఎక్కువగా విడుదల అవ్వడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు.

 దీని వలన అధికంగా బరువు పెరగడం, వెంట్రుకలు రాలిపోవడం, వేగవంతమైన హృదయ స్పందన (గుండె దడ). వణుకుతున్నట్లు మరియు/లేదా భయంగా అనిపించడం, బరువు తగ్గడం, పెరిగిన ఆకలి, అతిసారం మరియు తరచుగా ప్రేగు కదలికలు, దృష్టి మార్పులు సన్నని, వెచ్చని మరియు తేమతో కూడిన చర్మం. ఋతుక్రమంలో మార్పులు వంటివి ఏర్పడతాయి. వీటిని తగ్గించుకోవడానికి మన ఇంట్లో ఉండే దనియాలు అద్భుతమైన ప్రభావాన్ని చూపుతాయి. గ్లాస్ నీటిలో ఒక స్పూన్ ధనియాలు వేసి బాగా మరిగించి వడకట్టి ఈ నీటిని తాగడం వలన థైరాయిడ్ తగ్గుతుంది. కావాలంటే దీనిలో ఒక స్పూన్ తేనె కలుపుకోవచ్చు. ఉదయం లేదా సాయంత్రం ఈ కషాయం తాగడం వలన మంచి ఫలితాలు కనిపిస్తాయి. 

మరొక చికిత్స కోసం అవిసె గింజలను మెత్తని పొడి చేసి పెట్టుకోవాలి. ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు నీటిలో ఒక చెంచా పొడి కలిపి తీసుకోవచ్చు లేదా పెరుగులో కలిపి తీసుకోవచ్చు. చపాతి పిండిలో కలిపి చపాతీలు చేసుకోవచ్చు. ఇది ఉదయం తీసుకుంటే ధనియాలు సాయంత్రం తీసుకోవచ్చు. దీనితోపాటు పాలు, పాల పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. కాలిఫ్లవర్, క్యాబేజీ, ముల్లంగితో చేసిన పదార్థాలను కూడా తగ్గించాలి. ఐరన్, విటమిన్ బీ ట్వెల్వ్ ఎక్కువగా ఉండే గుమ్మడి కాయ, టమాటో, కోడిగుడ్లు, బీట్రూట్ , క్యారెట్ వంటి కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ఆరెంజ్, యాపిల్ వంటి పండ్లను కూడా తీసుకోవడం వలన థైరాయిడ్ సమస్యను తగ్గించుకోవచ్చు. నీటిని ఎక్కువగా తాగుతూ కొద్దిపాటి వ్యాయామం చేయడం వలన కూడా థైరాయిడ్ సమస్య తగ్గించుకోవచ్చు.

Leave a Comment

error: Content is protected !!