హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం నెల్లూరు స్టైల్ పప్పు చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.. పప్పు చారు ని చాలా మంది చాలా రకాలుగా చేస్తారు. ఈ స్టైల్ లో మీరు పప్పు చారు ని కనుక చేసుకొని తింటే అన్నాన్ని తినడం కాదు ఏకంగా పప్పుచారుతో తాగేస్తారు. పూర్తి రెసిపీ ఎలా చేసుకోవాలో ఈ కింది వీడియో చూడండి .
నెల్లూరు స్టైల్ పప్పుచారు తయారీ విధానం
ముందుగా కుక్కర్ తీసుకొని ఒక టీ గ్లాసు కందిపప్పు వేయండి. కందిపప్పును శుభ్రంగా కడిగి ఇందులో ఒక గ్లాసు నీరు పోయండి. తరువాత ఇందులో రెండు టమోటాలు కట్ చేసి వేయండి. తర్వాత 10 ఎండు మిరపకాయలు తుంచి ఇందులో వేయండి. మీకు కారం ఎక్కువ కావాలంటే ఇంకా కొన్ని ఎండు మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. ఒక పావు స్పూన్ పసుపు కలపండి. కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఒక చిన్న బౌల్లో నీళ్ళు పోసి నానబెట్టాలి.
కుక్కర్ విజిల్ తీసి పప్పుగుత్తి తో పప్పును మెత్తగా రామండి. ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని కలపండి. తరువాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ ని కలవండి. మీకు పప్పుచారు పల్చగా ఉండాలంటే కొద్దిగా ఎక్కువగా నీరు ను కలపండి.
స్టవ్ మీద బాణలి పెట్టి రెండు టేబుల్స్పూన్ల ఆయిలు వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపుదినుసులు(ఆవాలు జీలకర్ర శెనగపప్పు ఉద్దిపప్పు) వేయండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో ఐదు నుంచి ఆరు వెల్లుల్లి రెబ్బలు వేయండి. ఒక మూడు ఎండుమిరపకాయలు తుంచి ఇందులో వేయండి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ కట్ చేసి వేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు ఆకులు వేయండి. అన్ని బాగా వేగిన తర్వాత ఈ పోపు ని ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పులోకి కలపండి. ఇప్పుడు ఇందులో మీకు రుచికి సరిపడా ఉప్పుని కలుపుకోండి. తర్వాత ఈ పప్పు చారును స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో ఒక 10 నిమిషాలు బాగా మరగనివ్వాలి. తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరను అవసరమనుకుంటే ఆడ్ చేసుకోండి.
ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటలు తెలుసుకోవాలనుకుంటే మా పేజీని లైక్ చేసి షేర్ చేయండి.