Nerves Brain Active home remedies

నరాలన్నీ యమ ఆక్టీవ్ గా స్ప్రింగ్ లా వంగుతాయి

మన  మెదడు శరీరంలో అన్ని భాగాల కంటే ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.  మన మెదడు పనిచేస్తున్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు శరీరంలోని క్రియలు నియంత్రించే టప్పుడు  ఫ్రీ రాడికల్స్ రిలీజ్ అవుతాయి.  ఫ్రీ రాడికల్స్ మెదడులో పేరుకుపోవడం వలన మెదడు కణాల లైఫ్టైమ్ తగ్గిపోతుంది. అందుకే వయసు పెరిగేకొద్దీ ఆలోచన శక్తి, జ్ఞాపక శక్తి,   విచక్షణ శక్తి నిర్ణయాలు తీసుకునే శక్తి తగ్గిపోతాయి. మెదడులో ఫ్రీరాడికల్స్ ఎక్కువగా పేరుకుపోకుండా, బ్రెయిన్ సెల్స్ లైఫ్ టైం తగ్గిపోకుండా పెద్ద ఉసిరి కాయలు అద్భుతంగా ఉపయోగపడతాయని కొన్ని పరిశోధనల ద్వారా నిరూపించబడినది. 

2020 సంవత్సరం  బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఇండియా పరిశోధన స్పెషల్గా ఉసిరి కాయ మీద  మెదడుకు ఈ విధంగా  ప్రయోజనాలు ఇస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు.  ఉసిరి కాయ రక్షక వ్యవస్థకు  విటమిన్ సి అందిస్తుందని మాత్రమే మనకు తెలుసు. కానీ విటమిన్ సి మెదడులోని ఫ్రీరాడికల్స్ను  ఎక్కువగా రిలీజ్  చేయకుండా కూడా అద్భుతంగా పనిచేస్తుంది.  ఉసిరికాయలో విటమిన్ సి 600 మిల్లీగ్రాములు ఉంటుంది.

ఉసిరికాయ న్యూరో ట్రాన్స్మిషన్  పెరగడం వల్ల ఫ్రీ రాడికల్స్ ప్రొడక్షన్ తగ్గుతుంది.  అందువలన బ్రెయిన్ సెల్స్ లైఫ్ టైం  పెరుగుతుంది. ఉసిరికాయలు ఎలాజిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది.  ఎలాజిక్ యాసిడ్ ఫలితం ఏంటంటే మన మెదడులో డొపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆనందంగా నవ్వుతూ ఉండటం వల్ల ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఎలాజిక్ ఆసిడ్ డోఫమిన్   సెల్స్ ని యాక్టివేట్ చేసి ఎక్కువ హార్మోన్లు రిలీజ్ అయ్యేలా చేస్తుంది.

డోఫమిన్ తగ్గితే మానసిక సమస్యలు, నరాల సంబంధమైన సమస్యలు, పార్కిన్సన్స్ డిసీజ్ వంటి సమస్యలు వస్తాయి. అందుకే డోఫమిన్  ప్రొడక్షన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉసిరికాయలో క్లోరోజెనిక్  ఆసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది.  ఇది నరాల నుండి  శరీరంలో జరిగే మార్పులు, సంకేతాలను మెదడుకు  చేరవేస్తుంది.  మెదడు కణాలకు నరాలకు మధ్య సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటుంది.  క్లోరోజెనిక్ యాసిడ్  నెర్వ్ సెల్స్ లో ఎనర్జీ కి ఉపయోగపడుతుంది.  దానిద్వారా న్యూ ట్రాన్స్మిషన్  నరాల ద్వారా రాకపోకలు హెల్తీగా జరగడానికి నరాల బలహీనం  అవకుండా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఈ మూడు స్పెషల్గా కలిగి ఉండటం వలన ఉసిరికాయ తీసుకుంటే నెర్వ్ సెల్స్ కి, మెదడుకి మంచిది కాబట్టి ఉసిరికాయలు దొరికినపుడు జ్యూస్ చేసుకుని తేనె కలుపుకుని లేదా ఉసిరికాయ లో నానబెట్టుకుని తినాలి. లేదా ఉసిరికాయలను ముక్కలుగా చేసి బాగా ఎండబెట్టుకుని మెత్తటి పొడిలా చేసుకుని  పెట్టుకోవాలి. బయట మార్కెట్లో దొరికేవి  స్వచ్ఛమైనవో కాదో మనకు  తెలియదు కదా ఇలా దొరికినప్పుడు మనమే స్వయంగా తయారు చేసి పెట్టుకుంటే మంచిది. రోజుకి ఒక స్పూన్ తింటే మంచిది. రోజు మొత్తానికి కావాల్సిన విటమిన్ సి లభిస్తుంది.వేడి చేసేవాటిలో, కూరలలో విటమిన్ సి నశిస్తుంది కాబట్టి డైరెక్టుగా తీసుకోవడం మంచిది.

Leave a Comment

error: Content is protected !!