Never do these 5 things after having your night meal

రాత్రి అన్న తిన్నాక ఈ తప్పు అస్సలు చేయకండి. మహాపాపం.

మన భారతదేశంలో ఆహారాన్ని అన్నపూర్ణాదేవి అనుగ్రహంగా, పరబ్రహ్మ ప్రతిరూపంగా భావిస్తారు. అందుకే ఆహారాన్ని  వృధా చేయకూడదని మన పెద్దలు చిన్నతనం నుండి మనకు నేర్పిస్తారు. అలాంటి ఆహారాన్ని తిన్న తర్వాత కొన్ని పనులు చేయడం వలన మనకు దరిద్రం చుట్టుకుంటుందని అంటుంటారు. అలాంటి చేయకూడని పనులు ఏమిటో తెలుసుకుంటే ఇప్పటివరకు మనం ఆ తప్పులు కనుక చేస్తూ ఉంటే ఇప్పుడు సరిదిద్దుకొని ఆ తప్పులు ఇకపై చేయకుండా అన్నపూర్ణాదేవి అనుగ్రహానికి పాత్రులవుదాం. 

అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావించి మనం దాన్ని ముట్టుకోవడానికి ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవడం చాలా అవసరం. అలాగే అన్నం తినేటప్పుడు అది ప్లేట్ చుట్టూ పడకుండా జాగ్రత్త పడాలి. ఒకవేళ కిందపడినా వెంటనే తీసేయాలి. కింద పడ్డ మెతుకులను ఎవరూ తొక్కకుండా శుభ్రం చేయాలి. అన్నం తినేటప్పుడు ఎప్పుడూకూడా మాట్లాడకుండా  ఆహారాన్ని ముగించాలి. ఆహారాన్ని ముగించిన తరువాత చేతులను ప్లేట్ లో కడగకూడదు. చేతులు బయట కడుక్కోవాలి. 

అలాగే తిన్న ప్లేట్ ఎండిపోకుండా చూసుకోవాలి. కనీసం నీటితో అయినా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇక ఆహారం ముగించి పడుకునే ముందు ఎప్పుడూ చిన్న గిన్నెలను శుభ్రం చేసుకోవాలి. తిన్న గిన్నెలను అలా కడగకుండా పెట్టడం వలన దరిద్రాదేవి పట్టుకుంటుందని చెబుతారు. వీలైనంత వరకు పడుకోవడానికి ముందు  తిన్న గిన్నెలు శుభ్రం చేసి వంట చేసుకునే ప్రదేశాన్ని శుభ్రంగా పెట్టుకొని పడుకోవాలి. ఆహారం తిన్న తర్వాత చేతులను విదిలించకూడదు. చేతులు కడుక్కున్న తరువాత శుభ్రంగా తుడుచుకోవాలి. అలాగే ఆహారం తినేటప్పుడు పొలమారితే లేచి చేతులు కడుక్కొని రావాలి. అలాగే కూర్చుని మాత్రమే భోజనం చేయాలి. తిరుగుతూ భోజనం చేయకూడదు. అలాగే తిన్న వెంటనే పడుకోకూడదు.

మన పూర్వికులు పెట్టిన ఇలాంటి నియమాలన్నీ నీ ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో రహస్యాలను దాచి పెట్టుకున్న సూత్రాలు. సరిగ్గా ఆలోచిస్తే ఇందులో ఎంతో సైన్స్ దాగి ఉంటుంది. శుభ్రంగా ఉండడం, ఆహారాన్ని క్రమపద్ధతిలో తీసుకోవడం, తిన్న ఆహారం జీర్ణం అయ్యేందుకు ఉపయోగపడే చిట్కాలు ఈ పద్ధతుల్లో దాగి ఉంటాయి. అందుకే పెద్దలు చెప్పిన విషయాలను పిచ్చి నమ్మకాలుగా భావించి పక్కన పెట్టకుండా తప్పకుండా పాటించడం వలన అనారోగ్యాల బారిన పడకుండా సంపూర్ణ ఆరోగ్యంతో, దాని వలన సకల ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండొచ్చు.

Leave a Comment

error: Content is protected !!