palli pachi mirchi tomato chutney

అన్ని టిఫిన్లలోకి,రాగిసంగటి, అన్నంలోకి అదిరిపోయే ఈ ” పల్లి పచ్చిమిర్చి టమాటో పచ్చడి”

ప్రియమైన భోజన ప్రియులారా.. ఈరోజు మనం రాయలసీమ స్టైల్ లో పల్లీలు పచ్చిమిర్చి టమాటా పచ్చడి. ఆల్ ఇన్ వన్ చెట్నీ అని చెప్పుకోవచ్చు రాగి సంగటి ఇ అలాగే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తినవచ్చు. పూరి చపాతీ ఇడ్లీ దోసె ఎందులోకైనా చాలా సూపర్ గా ఉంటుంది.

పల్లి పచ్చిమిర్చి టమోటో పచ్చడి కి కావలసిన పదార్థాలు

  • పల్లీలు ఒక కప్పు
  • ఇరవై పచ్చిమిరపకాయలు
  • రెండు ఉల్లిపాయలు
  • చింతపండు కొద్దిగా 
  • కొత్తిమీర కొద్దిగా 
  • మూడు టమోటోలు

తయారీ విధానం

  • గ్యాస్ వెలిగించుకొని దాని మీద కడాయి పెట్టుకుని పల్లీలు వేసి వేయించండి. చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు కడాయిలో కొద్దిగా నూనె వేయండి. ఇందులో పచ్చిమిరపకాయలు కట్ చేసి ఇందులో వేసి కొద్దిగా ఫ్రై చేయండి. వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి.
  • కడాయిలో కొద్దిగా నూనె వేసి టమోటోలను పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి కొద్దిగా ఫ్రై చేయండి. తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసి వేయించండి.
  • ఓక మిక్సీ జార్ తీసుకొని అందులో పచ్చి మిరపకాయలు, చింతపండు, కొద్దిగా ఉప్పు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి కచ్చా పచ్చాగా  గ్రైండ్ చేయండి.
  • చివరిగా ఇందులో మగ్గిన టమోటాలను కొత్తిమీరను వేసి గ్రైండ్ చేయండి.
  • తర్వాత ఇందులో ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇందులో వేసి కలపండి. తర్వాత మిక్సీ ని ఒక రెండు సెకండ్స్  గ్రేడ్ చేయండి. మీరు కావాలనుకుంటే ఉల్లిపాయలను కూడా ఫ్రై చేసి కలుపుకోవచ్చు.

మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటలు తెలుసుకోవడానికి మా పేజీని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి

Leave a Comment

error: Content is protected !!