Paralysis Symptoms in telugu

పక్షవాతం వస్తుంది అని తెలిపే లక్షణాలు ఏంటి? పెరాలసిస్ రావడానికి ఈ మూడే ముఖ్యమైన కారణాలు.

పక్షవాతం అనేది మొండి జబ్బు ఇది గనక వస్తే మనిషి తన సహజంగా చేసుకునే పనులు కూడా చేసుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. దీని నుంచి 20 శాతం మందే కోలుకుంటారు. మిగిలిన వారందరూ జీవితాంతం ఈ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి పక్షవాతం అనేది చెప్పి రాదు.  నిమిషం ఆర నిమిషంలో సడన్ గా కాలు చేయి లాగేస్తాయి. అటువంటి పెరాలసిస్ రావడానికి 3 ప్రాధాన కారణాలు ఉన్నాయి. ఈ జబ్బు రాకుండా ఉండాలంటే ఈ ప్రాధాన కారణాలపై ద్రృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ రోజుల్లో పక్షవాతం అనేది 15, 20 సంవత్సరాల లోపు పిల్లల నుంచే వచ్చేస్తుంది. పూర్వం రోజుల్లో 60, 70 సంవత్సరాలు దాటిన వారికి వచ్చేది.

దీనికి కారణం మన జీవన శైలిలో వచ్చే ఈ మూడు తప్పులు.  మొదటి గా ఉప్పు. సాల్ట్ తినడం వల్ల ఎక్కువ ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా సాల్ట్ కు రక్తాన్ని చిక్క పరిచే గుణం ఉంటుంది. బిపి రావడానికి కూడా సాల్ట్ కారణమవుతుంది. సాధారణంగా చూస్తే ఎ దేశాలు సాల్ట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఆ దేశాల్లో పెరాలసిస్ రావడం ఎక్కువగా ఉంటుంది. డాక్టర్ చెప్పిన ప్రకారం మనం రోజులో 4గ్రా. మాత్రమే ఉపయోగించాలి. కానీ నీ మనం రోజుకు 15 గ్రాముల సాల్టు కు పైనే వాడుతున్నాము. బాడీ కి కావాల్సిన సాల్ట్ సహజంగా కూరగాయలు, పళ్ళులో, ఆకుకూరలో ఉంటుంది. కాబట్టి  మనం బాహ్యంగా సాల్ట్ ను ఉపయోగించనవసరం లేదు. కానీ మానలేం అనుకునేవాళ్ళు మూడు వంతుల వరకు తగ్గించుకోవాలి.

రెండవది తెల్లటి పదార్థాలు. అనగా పిండి పదార్థాలు, మైదాపిండి, పిండి పదార్థాలతో చేసే స్వీట్స్ మొదలైనవి. వీటిలో కార్బోహైడ్రేట్లు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇవి  త్వరగా జీర్ణమయ్యి కొవ్వుగా మారతాయి. తర్వాత ఎల్.డి.ఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ గా మారతాయి. ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ వలన రక్తనాళాలు కుడుకుపోతాయి. దీని ద్వారా రక్త ప్రసరణ జరగక పెరాలసిస్ వచ్చే ఆకాశం ఎక్కువ అవుతుంది. అంతేకాకుండా ఈ కొలెస్ట్రాల్ రక్తంలో ప్రవహించి మెదడు యొక్క రక్త నాళాల్లో అడ్డుపడడం వల్ల కూడా పెరాలసిస్ వచ్చే అవకాశం ఎక్కువ.

మూడవదిగా హైబీపీ దీనివలన రక్తనాళాలు సంకోచించి ఉండిపోతాయి. మరియు వ్యాకోచించే శక్తిని కోల్పోతుంది. దీని వలన రక్త ప్రసరణ సరిగ్గా జరగదు దీని ద్వారా కూడా పెరాలసిస్ వచ్చే అవకాశం ఎక్కువ అవుతుంది. కనుక ఈ మూడింటి నుంచి మనం దూరంగా ఉంటే పెరాలసిస్ ముప్ప నుంచి తప్పించుకోవచ్చు….

Leave a Comment

error: Content is protected !!