People who should not eat papaya

ఇది తెలిస్తే స్త్రీలు అసలు బొప్పాయి జోలికి వెళ్లరు

అందరూ బొప్పాయి ఇష్టంగా తింటారు. పచ్చి బొప్పాయి తో కూర, పులుసు చేసుకోవడం లేదా స్నాక్స్ ఐటమ్స్ చేసుకోవడం సలాడ్ రూపంలో తింటుంటారు. ఇది ఎప్పటి నుండో  అలవాటు గా వస్తుంది.  పూర్వం కూరలు లేనప్పుడు పచ్చి బొప్పాయి కూర వండుకొని తినే వారు. ఇప్పుడు కూడా మార్కెట్ లో పచ్చి బొప్పాయిలను అమ్ముతున్నారు. పచ్చి బొప్పాయితో కూర, పులుసు, హల్వా అన్ని రకాల ఐటమ్స్ చేసుకుంటారు.

పచ్చి బొప్పాయిని  అందరూ తినొచ్చు కానీ ఇద్దరు మాత్రం తినకూడదు. గర్భిణి స్త్రీలు, నెలసరి సమయంలో ఉన్న స్త్రీలు.  గర్భిణీ స్త్రీలు పచ్చి బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం జరుగుతుందని మన పెద్ద వాళ్ళు అంటుంటారు. అది నిజమని కొన్ని పరిశోధనల ద్వారా రుజువైంది. పచ్చి బొప్పాయి గిల్లినా, కట్ చేసిన పాలు  వస్తాయి ఆ పాలలో లాటెక్స్  అనే పదార్థం ఉంటుంది.  ఇది ఆడవారి శరీరం లోపల ప్రోస్టాగ్లాండిన్స్స్,  ఆక్సిటోసిన్ అనే వాటిని రిలీజ్ అయ్యేలా  స్టిమ్యులేట్ చేస్తుంది. 

ఈ 2 రిలీజ్ అవ్వడం వలన యూట్రస్ మజిల్స్  ముడుచుకుంటాయి. ఎక్కువగా కాంట్రక్షన్స్ ఉండడం వలన  లోపల ఉన్న పిండం బయటకి వచ్చేస్తుంది. పచ్చి బొప్పాయి తినడం వల్ల కడుపులోని పిండం బయటకి వచ్చేయడం  వల్ల గర్భస్రావం జరుగుతుంది. నెలసరి  సమయం లో పచ్చి బొప్పాయి తినడం వలన బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది. గర్భిణి స్త్రీలు, నెలసరి సమయంలో ఉన్న వారు అసలు పచ్చి బొప్పాయి తినకూడదు. ఇది కేవలం నానుడి మాత్రమే కాదు సైంటిఫిక్గా రుజువయింది. 

ఇది ఎలా  నిరూపించారు అంటే  గర్భం వచ్చిన ఎలుకలకు  3.2  మిల్లిగ్రాముల లాటెక్స్ ఇవ్వడం  జరిగింది. పచ్చి బొప్పాయి లో ఉండే  లేటెక్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి ఎలుకలకి ఇవ్వడం జరిగింది. ఎలుకలకు గర్భస్రావం జరిగింది. పచ్చి బొప్పాయి తినడం వల్ల గర్భస్రావం జరుగుతుంది అని ఎలుకలపై పరిశోధన చేసి నిరూపించిన వారు 2017 వ సంవత్సరం నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, సింగపూర్ దేశం వారు పరిశోధన  స్పెషల్గా పచ్చి బొప్పాయి మీద చేసి నిరూపించారు. 

పచ్చి బొప్పాయి అందరూ తినొచ్చు గర్భిణీ స్త్రీలు, నెలసరి సమయంలో ఉన్న స్త్రీలు మాత్రం తినకూడదు. పండిన  బొప్పాయి తినడం వల్ల ఎలాంటి దోషం ఉండదు.  బొప్పాయి పండు అయ్యే సరికి లాటెక్స్  తగ్గిపోతుంది. కాబట్టి పండు బొప్పాయి గర్భిణి స్త్రీలు, నెలసరి సమయంలో ఉన్నవారు కూడా తినడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.

Leave a Comment

error: Content is protected !!