మన నిత్య జీవితం సాధారణంగా జరగడానికి మన రోజువారీ అలవాట్లు కూడా దోహదపడతాయి. కానీ మన ఆహారంలో చోటుచేసుకున్న మార్పులు మనరోజులో సహజంగా జరగవలసిన శరీర క్రియలను దెబ్బతీస్తున్నాయి. తినే ఆహారంలో ఫైబర్ లోపం, ప్రేగుల కదలికల్లో అడ్డంకులు, తగినంత నీరు తాగకపోవడం, బలహీనమైన కటి కండరాలు మలబద్దకానికి కారణమవుతున్నాయి. మలబద్దకం వలన శరీరంలోని మలం బయటకు వెళ్ళక రోజంతా అసౌకర్యంగా ఉంటుంది.
శరీరంలో ఆహారంతో పాటు చేరిన వ్యర్థాలు విసర్జన జరగకపోతే అవి విషపదార్థాలుగా మారి రక్తంలో కలుస్తాయి. అంతేకాకుండా రోజంతా చిరాకు, ఒత్తిడి కలుగజేసి అనవసర కోపాలను పెంచుతుంది. మలబద్దకం వలన అనేక అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది. ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులైన గ్యాస్, అజీర్ణం, ఛాతీలో మంట, మరియు మొలలు, ఫిషర్స్, తలనొప్పి, టెన్షన్ వంటి అనారోగ్యాలు కనిపిస్తాయి. చిన్న పిల్లల్లో,పెద్ద వయసువారిలో కూడా మలబద్దకం ఉంటుంది. కొన్ని మందులు ఉపశమనం కలిగించినా దీర్ఘకాలం ఉపయోగించకూడదు. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
అందుకే మనం కొన్ని ఇంటిచిట్కాలతో సమస్య ను పరిష్కరించవచ్చు.
- ఉదయాన్నే వేడినీరు తాగడంవలన మలవిసర్జన సులభంగా జరుగుతుంది.
- వ్యాయామం కూడా ప్రేగులలోని వ్యర్థాలను వెలికితీసి కడుపు శుభ్రపడేలా చేస్తుంది.
- పెరుగు, మజ్జిగ ఆహారంలో భాగం చేసుకోవడంవలన ప్రోబయొటిక్స్ శరీరంలో చేరి ప్రేగుల కదలికలు సులభంచెసి కడుపు ఉబ్బరం సమస్యను తగ్గిస్తుంది.
- ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినడం కూడా మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
- రోజులో తగినంత నీరు మరియు కొబ్బరినీరు తాగడంవలన ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది.
- కార్బోహైడ్రేట్లు తగ్గించి రోజంతా కూర్చొని ఉండకుండా అప్పుడప్పుడు నడవడం వలన కూడా సమస్య తగ్గుతుంది.
అంతేకాదు రెండు స్పూన్ల వాము, రెండు స్పూన్ల జీలకర్ర వేయించి అందులో అరస్పూన్ నల్ల ఉప్పు, స్పూన్ సోంపు తీసుకుని మిక్సీ పట్టాలి. ఈ పొడిని గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి. భోజనం తీసుకున్న గంట తర్వాత రోజూ తీసుకోవాలి.
లేదా గ్లాసు పాలతో ఒక స్పూన్ ఆముదం కలుపుకొని తాగాలి. ఇది కొంచెం చేదుగా ఉన్నా రాత్రి తాగితే ఉదయానికి కడుపు శుభ్రం అయిపోతుంది.
ఈ రెండు చిట్కాలతో సత్వర ఉపయోగం ఉంటుంది. దీర్ఘకాలం మందులపై ఆధారపడకుండా జీవనవిధానంలో మార్పుల ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి.
తల లో చిన్న చిన్న తెల్లని పొక్కులు కనిపిస్తున్నాయి, వాటిని తొలగించడానికి సులభ చిట్కాలు తెలుపగలరు