pimples home remedies for oily skin

మొటిమలు, మొటిమలు వల్ల వచ్చే మచ్చలు,acne, సన్ టాన్ నలుపు మొత్తం పోయి చర్మం తెల్లగా మెరిసిపోతుంది

మనలో చాలామంది మొటిమలు, మొటిమల వల్ల వచ్చే మచ్చలు, సన్ టాన్ వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. వాటిని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్  ఉపయోగిస్తారు. ఈ  ప్రొడక్ట్స్ ఉపయోగించడం వల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ చర్మ సమస్యలను తగ్గించుకొని మీ ముఖం అందంగా, కాంతివంతంగా మెరిసిపోవాలంటే ఈ చిట్కా ట్రై చేసి చూడండి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది.

      దీని కోసం మనకు కావలసింది డ్రాగన్ ఫ్రూట్ తొక్క.  మనం  పూర్తిగా తినేసిన తర్వాత పడేసే  తొక్కలో చాలా విటమిన్స్ ఉంటాయి. ఇది ముఖానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దీంతో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలి మనం తెలుసుకుందాం. డ్రాగన్ ఫ్రూట్  తొక్క నుండి స్పూన్తో మెత్తగా ఉండే గుజ్జు వంటి పదార్ధాన్ని  తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక డ్రాగన్ ఫ్రూట్ మూడుసార్లు ఫేషియల్కి ఉపయోగపడుతుంది. దీనిని ఫ్రిజ్లో పెట్టినట్లయితే ఒక నెలరోజుల వరకు నిల్వ ఉంటుంది.

       ఈ  గుజ్జులో ఒక చెంచా కాన్ ఫ్లోర్ వేసుకోవాలి.  కాన్ ఫ్లోర్  లేని వాళ్ళు బియ్యప్పిండిని  లేదా  సెనగ పిండిని కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో ఒక చెంచా ఎవర్  యూత్ గోల్డెన్ ఫేషియల్ వేసుకోవాలి.  ఫేషియల్ కి బదులుగా  పచ్చి పాలను కూడా వేసుకోవచ్చు.  వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి.  ప్యాక్ ను ముఖానికి అప్లై చేసుకోవడానికి ముందు ముఖాన్ని ఒక్కసారి శుభ్రంగా కడుక్కోవాలి.  కడిగిన తర్వాత ఈ ప్యాక్ ను అప్లై చేసుకొని ఒక పది నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. 

     ఇలా చేసినట్లైతే ముఖంపై ఉండే మొటిమలు, నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్ వంటివి పోయి చర్మం తెల్లగా మెరిసిపోతుంది. మీ ముఖం అందంగా, కాంతివంతంగా తయారవుతుంది. ఎటువంటి కెమికల్స్ లేవు. కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ రావు. ఇవన్నీ వద్దు అనుకున్న వాళ్లు డ్రాగన్ ఫ్రూట్  తొక్క నుండి తీసిన గుజ్జులో కొన్ని పచ్చి పాలు వేసి కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవచ్చు. పచ్చి పాలు చర్మం  యొక్క ఛాయను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తాయి. పాలు మరియు డ్రాగన్ ఫ్రూట్ తొక్క నుంచి తీసిన గుజ్జు బాగా కలుపుకొని ముఖానికి అప్లై చేసి పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నల్లగా మారిన మీ చర్మం తెల్లగా మెరిసిపోతుంది.

Leave a Comment

error: Content is protected !!