మనందరం ఆరోగ్యకరంగా ఉండాలి అంటే ఆహారము మన శరీరానికి సరిపడా సమపాలల్లో తీసుకుంటూ ఉండాలి. కానీ కొంచెం ఆహారం తీసుకోవాలి అన్న మనకు ముందుగా ఆకలి అనేది ఉండాలి. కొంతమందికి అసలు ఆకలి ఉండదు. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఆకలి మందగించి వారు ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీరికి ఆకలి పుట్టాలి అని హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అనేక మందులు మింగుతూ ఉంటారు. కానీ వాటి వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంతేకాకుండా ఇవి కెమికల్స్ తో తయారు చేసినవి కావున సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు.
ఇప్పుడు మనం చెప్పుకునే చిట్కా ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన ప్రకృతి వైద్యంలోనిది. ఇది సొంటి చిట్కా. సొంటి అంటే ప్రస్తుత కాలంలో ఎవరికి తెలియదు గానీ. పూర్వం రోజుల్లో మన పెద్దలైన వారు ఎక్కువగా ఉపయోగించేవారు. ఎక్కువగా దీన్ని బాలింతలకు అన్నంలో కలుపుకుని తినేలాగా ఇచ్చేవారు. సొంటి అంటే మన ఇంట్లో లభించే అల్లాన్ని పాలులో నానబెట్టి దానిని ఎండబెట్టగా తయారైన గట్టి కొమ్మును సొంటి అంటారు. ఇది ముడుచుకుపోయి ఉంటుంది. ఈ సొంటి కొమ్ములను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడి లాగా చేసుకుని ఏదైనా గుడ్డ సహాయంతో జల్లించుకోవాలి.
ఇలా జల్లించు కోగ వచ్చిన మెత్తని పొడిని సొంతిపొడి అంటారు. ఆకలి అవ్వకుండా పోట్ట మందంతో ఇబ్బంది పడే వారికి సొంటి అద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన పవర్ఫుల్ డైజెస్టివ్ టానిక్ లాంటిది. ఇలాంటి సొంటిని ఎలా ఉపయోగించాలి అంటే భోజనం చేసేటప్పుడు ఒకటి లేదా రెండు ముద్దలో చిటికెడు సొంటిపొడిని అన్నంతో పాటు కలిపి తీసుకోవాలి. సొంటీ పోడి చాలా ఘాటుగా ఉంటుంది. అందువలన ఎక్కువ వేసుకుంటే చాలా మండుతుంది. కనుక వేల మధ్యలో చిటికెడు తీసుకుని వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి కలుపుకోవడం వలన ఘాటు తగ్గుతుంది.
దీనివలన కమ్మగా కూడా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధ ఎంజైమ్స్ ఉత్పత్తిని బాగా పెంచడానికి, అరుగుదలను ప్రేరేపించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. కనుక ప్రతిదానికి మందుల దగ్గరికి వెళ్లకుండా ప్రకృతి సిద్ధంగా లభించే వాటిని ఉపయోగించుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ సోంటి పోడిని మనము గాని పిల్లలు గాని ఎవరైనా ఉపయోగించవచ్చు. కనక దీనిని ఉపయోగించి మంచి ఫలితాలు పొంది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు…