precautions after covid recovery

కోవిడ్ వచ్చి తగ్గిన ప్రతి ఒక్కరికి ఈ జాగ్రత్తలు పాటించడం ముఖ్యం?…

కోవిడ్ వైరస్ వచ్చిన తర్వాత మన చుట్టూ అంతా బ్యాక్టీరియా వైరస్ మయం అని మనకు తెలుసు. మన శరీరంలో కణాల కంటే వైరస్ బ్యాక్టీరియా సంఖ్య ఇంకా ఎక్కువ ఉంటుంది. మరి అంత ఎక్కువ వైరస్ బ్యాక్టీరియాలో మన శరీరంలోకి గాలి ద్వారా గాని ఆహారం ద్వారా గాని లోపలికి వెళ్ళిపోతాయి.  వీటిని ఎదుర్కొని వాటిని బంధించే యాంటీబాడీస్ మనలో ఉత్పత్తి అవ్వాలి. మనలో రక్షణ వ్యవస్థ దానికి విరుగుడు తయారుచేస్తాయి అవే యాంటీబాడీస్. ఆ యాంటీబాడీస్ కోవిడ్ వైరస్ ని బంధించి అది లంగ్స్ లోకి వెళ్లి పాడు చేయకుండా ప్రాణహాని కలగకుండా యాంటీబాడీస్ కాపాడుతున్నాయి. 

                    ఈ యాంటీబాడీస్ ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి అవ్వాలి ఏ వైరస్ కన్న ఉత్పత్తి అవ్వాలి. అలాంటి యాంటీబాడీస్ నీ బీసెల్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాయి. బి లింఫోసైట్స్ లింఫోసైట్స్ లో ఒక రకం బీ లింఫోసైట్స్. ఈ బీ లింఫోసైట్స్ యాంటీబాడీస్ ని బాగా ప్రొడ్యూస్ చేయాలంటే ఫస్ట్ మైక్రో న్యూట్రీషన్లు యాంటీ ఆక్సిడెంట్, రిచ్ డైట్ బాగా తీసుకోవాలి. సూక్ష్మ పోషకాలు అధికంగా ఉండే పండ్లు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, ఆకుకూరలు, కూరగాయలు,  జ్యూస్ వీటన్నింటిలో మైక్రో న్యూట్రియన్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. 

నేచురల్ గా లభించే ఇలాంటి ఆహారాల ద్వారా యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ గా ఉండే డైట్. ఇవన్నీ బాగా ఉంటే బీసెల్స్ యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడతాయి.

           ఈ బీసెల్స్ కి ముఖ్యంగా రా మెటీరియల్ మైక్రో న్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కణజాలం రక్షించడానికి వైరస్ బ్యాక్టీరియాలని ఎదుర్కొని యాంటీ బాడీస్ ని ప్రొడ్యూస్ చేయడానికి అతి ముఖ్యంగా కావాలి. రెండవది ప్రతిరోజు క్రమం తప్పకుండా ఎనిమిది గంటలసేపు నిద్రపోవాలి. నిద్ర తగ్గితే యాంటీబాడీస్ తగ్గిపోతాయి. కంటిన్యూ గా 8 గంటలసేపు గాడ నిద్రపోవాలి. నిద్ర రావాడానికి నాచురల్ ఫ్రూట్స్ భోజనం కింద తినేసి నిద్రపోవాలి ఇలా చేస్తే అనారోగ్యానికి తక్కువ గురి అవుతున్నారు. మూడవది రోజుకి 45 నిమిషాలు అన్నా వ్యాయామం చేయాలి. 

              నాలుగవది మానసిక ఒత్తిడి అసలు ఉండకూడదు. దీనివల్ల రక్షణ వ్యవస్థ క్షీణిస్తుంది. బీసెల్స్ యాంటీబాడీస్ ని సరిగా ప్రొడ్యూస్ చేయలేవు. ఐదవది ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్ పెరగకుండా చూసుకోవాలి. ఆరవది స్మోకింగ్, డ్రింకింగ్ అస్సలు చేయకూడదు. ఆ మత్తులో రక్షణ వ్యవస్థ కూడా సరిగా పనిచేయదు. కాబట్టి వీటిని అవాయిడ్ చేయాలి.

Leave a Comment

error: Content is protected !!