Quick Relief From Acidity

గ్యాస్ మరియు మలబద్దక సమస్యకు ఇంట్లోనే అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు

హలో ఫ్రెండ్స్ …ఈ రోజు లో ప్రతి 10 మందిలో 8 మంది ఎసిడిటీ మరియు కడుపుకు సంబంధించిన అనేక రకాల వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. కడుపులో మంట, త్రేపులు, కడుపు ఉబ్బరంగా అనిపించడం, తిన్న ఆహారం సరిగా అరగకపోవడం మలబద్ధకం, గ్యాస్ సమస్యలు కడుపులో నొప్పి లక్షణాలు ఎక్కువ శాతం ఎసిడిటీ వల్ల వస్తాయి. ఎసిడిటీ సమస్య వల్ల అప్పుడప్పుడు మన ఫుడ్ పైపులో కూడా  మంటగా అనిపిస్తుంది. దీనిని హార్ట్ బర్న్ అని కూడా పిలుస్తారు. దీనివల్ల కడుపులో యాసిడ్ శాతం బాగా పెరిగిపోయి అప్పుడప్పుడు ఆసిడ్ మన గొంతు వరకు వచ్చేస్తుంది.

ఎప్పుడైనా మసాలా పదార్థాలు ఎక్కువగా తిన్నావా లేదా అప్పుడప్పుడు సరైన టైమ్కి భోజనం చేయకపోయినా ఎసిడిటీ సమస్య వస్తూ ఉంటుంది. కానీ ఈ సమస్య తరచుగా ప్రతిరోజు వస్తూ ఉంటే కొంతకాలానికి పెద్ద అనారోగ్యం గా మారుతుంది. అందుకే మొదట్లోనే దీనిని గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. చాలామంది ఎసిడిటి సమస్యను చాలా సాధారణ సమస్యగా భావించి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ ఇది మన కడుపు మరియు  జీర్ణాశయానికి సంబంధించిన వ్యాధి మన జీర్ణాశయం మన శరీరంలో జరిగే మెయిన్ ఫంక్షన్ అందుకే అది ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం ఒకవేళ కడుపు మరియు జీర్ణాశయం సక్రమంగా పని చేయకపోతే శరీరంలో 100% ఖచ్చితంగా ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తుంది. అలాగే ఎసిడిటీ సమస్య బాగా పెరిగిపోతే కడుపు మరియు చిన్న ప్రేగులు అల్సర్లు రావడం తో పాటు కొంతకాలానికి క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది.

అందుకే సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా అవసరం. చాలా మంది డాక్టర్లు ఇచ్చే టాబ్లెట్స్ వాడడం వలన ఎసిడిటీ సమస్య తగ్గిపోతుంది అనుకుంటారు. ఈ టాబ్లెట్లు వాడడం వలన కొంత సమయం వరకే తగ్గి మళ్లీ కొంతకాలానికి తిరిగి వస్తూ ఉంటుంది. ఎక్కువగా టాబ్లెట్ వేసుకోవడం ఖాళీకడుపుతో వేసుకునే టాబ్లెట్స్ వలన ఎసిడిటీ సమస్య ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది. ఈరోజు మనం ఎసిడిటీ సమస్య పూర్తిగా తగ్గించుకోవడానికి అద్భుతమైన ఆయుర్వేద చిట్కాలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి.

మొదటి చిట్కా .. ముందుగా మీరు ఒక గ్లాసు నీటిలో 20 ఎంఎల్ వేడిచేసి చల్లార్చిన పాలు కలిపి అందులో ఒక చెంచా ఆవునెయ్యి వేసి ఒకసారి బాగా కలుపుకొని తాగేయాలి. ఎప్పుడైనా మీకు ఎసిడిటీ సమస్య వస్తే ఇలా చేస్తే మీకు వెంటనే ఉపశమనం లభిస్తుంది. అసిడిటీ ఉన్న వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని తాగాలి. ఒకవేళ మీకు నెయ్యి వద్దు అనుకుంటే భోజనం చేసిన తర్వాత కనీసం చల్లని పాలు తాగండి.

రెండో చిట్కా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో కొద్దిగా జీలకర్ర వేసి రెండు నుంచి మూడు నిమిషాలు వేయించండి ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఆ తర్వాత ఒక కప్పు తీసుకొని అందులో ఒక అర టీ స్పూను వేయించిన జీలకర్ర పొడి, అర టీ స్పూన్ పసుపు, ఒక అరటి స్కూల్ బ్లాక్ సాల్ట్ వేసి ఈ మిశ్రమంలో ఒకటిన్నర టీస్పూన్ వేడిచేసిన నిమ్మరసం వేయాలి. అన్నింటినీ బాగా కలిపి తాగేయాలి. ఈ మిశ్రమం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమం తీసుకున్నావ్ 30 సెకన్లలో పని చేయడం మొదలు పెడుతుంది. కొద్ది సమయంలోనే మీ ఎసిడిటీ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది.

Leave a Comment

error: Content is protected !!