Quick Weight Loss Home Remedies - Best Fat Cutter Drink

ఒంట్లో పేరుకుపోయిన ఎటువంటి కొవ్వు అయినా సరే కరిగిపోవాల్సిందే…….. ఉదయం పూట ఒక్క గ్లాస్ చాలు………

ఈ రోజుల్లో చాలామందికి ఆరోగ్యం పట్ల అవగాహన కలుగుతుంది. అందువలన జనరల్ మెడికల్ టెస్ట్లు, మాస్టర్ మెడికల్ టెస్ట్ లు ఎక్కువగా చేయించుకుంటూ ముందుగా జాగ్రత్త పడుతున్నారు. ముఖ్యంగా 20 నుంచి 30 సంవత్సరాల లోపు వారు ఏదైనా సమస్య ఉంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ బరువు పెరిగితే మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దీనికి కారణం బరువు పెరిగితే భవిష్యత్తులో చాలా అనారోగ్యాలకు కారణం అవుతుంది‌ అని అవగాహన లేకపోవడం. ఆ కారణంగా బరువు పెరిగిన పట్టించుకోరు.

ఈ సమస్య భవిష్యత్తులో అనేక రుగ్మతలకు కారణం అవుతుంది. అంటే థైరాయిడ్, బిపి, షుగర్, కొలెస్ట్రాల్, గుండె సమస్యలు వాటికి కారణం అవుతుంది. వీటి కారణంగా ఒబైసిటి ఒక వ్యాధిగా పరిగణించారు. దీన్ని బట్టి దీని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకోబోయే రెమెడీతో పాటు ఆహారంలో మార్పులు చేసుకుంటూ వారానికి ఐదు రోజుల పాటు వ్యాయామాలు చేయడం ద్వారా అధిక బరువు సమస్య నుంచి విడుదల పొందవచ్చు. వీటితో పాటు జీలకర్రను కూడా మనం సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది.

ఈ జీలకర్రను ఉపయోగించి ఔషధం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం. 200 మిల్లీలీటర్ల నీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇందులో ఐదు గ్రాముల జీలకర్ర అంటే ఒక టీ స్పూన్ వేసుకొని స్టవ్ పై పెట్టుకొని బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఒక గ్లాసులోనికి కషాయాన్ని వడకట్టుకోవాలి. ఇక కాషాయం గోరువెచ్చగా అయిన తర్వాత ఒక టీ స్పూన్ నిమ్మరసం కలుపుకోవాలి. ఇలా తయారైన కషాయము రోజు ఉదయం పూట పరగడుపున తీసుకోవాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా మన జీవన విధానంలో అలవాటు చేసుకోవాలి.

ఈ విధంగా తీసుకోవడం వలన మనకు ఉపయోగం ఏమిటి అంటే జీలకర్రలో థైమొక్వీనన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. ఇది మన శరీరంలో మెటాబాలీజం, లివర్ యొక్క పనితీరును చైతన్య పరుస్తుంది. దీని ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. దీనితో పాటు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తాయి. నిమ్మకాయలో ఉండే రసాయన పదార్థాలు మనం తీసుకునే ఆహారంలో ఉండే కొవ్వు పదార్థాలను పేగులు జీర్ణం చేసుకోకుండా అడ్డుకునే శక్తి వీటికి ఉంటుంది.     కనుక వీటిని ఉపయోగించడం ద్వారా అధిక బరువు సమస్య నుంచి విడుదల పొందవచ్చు….

Leave a Comment

error: Content is protected !!