real facts about uttareni plant

ఈ మొక్క ఎక్కడైనా కనిపిస్తే అస్సలు వదలకండి..వెంటనే ఇంటికి తెచ్చుకోండి

హలో ఫ్రెండ్స్ మన ఇంటి చుట్టూ ఎక్కడపడితే అక్కడ కనిపించే ఉత్తరేణి మొక్కను  పిచ్చి మొక్క అనుకుంటే పొరపాటు పడినట్లే. సంస్కృతంలో అపామర్గంగా  పిలిచే దీనిని మన పూర్వీకులు ఎప్పటినుండో సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఉత్తరేణి ఆకు విత్తనాలు వేరు కాండం అన్ని మందుగా పనికొస్తాయి. ఉత్తరేణి ఆకులలో యాంటీ ఫంగల్ యాంటి మైక్రోబియల్ యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉన్నాయి.

శరీరం పైన గాయాలు పుండ్లు దురదలు ఉన్నవారు ఉత్తరేణి ఆకుల రసం తీసి అవి ఉన్నచోట లేపనంగా పూస్తే కవి చాలా త్వరగా తగ్గిపోతాయి.

ఉత్తరేణి ఆకు విషాన్ని హరించే శక్తి ఉంది తేలు వంటి  విష కీటకాలు కరిచినప్పుడు ఆకుల రసాన్ని కుట్టిన చోట పూసి ఆకులను మెత్తగా నూరి కట్టుగా కడితే విష ప్రభావం తగ్గిపోతుంది.

నడుము నొప్పి కీళ్ల నొప్పి ఉన్నవారు ఉత్తరేణి ఆకులను మెత్తగా నూరి నొప్పి ఉన్నచోట కట్టుగా కడితే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.

ఉత్తరేణి ఆకులకు పొట్ట లో పేరుకుపోయిన కొవ్వును కరిగించే శక్తి ఉంది. పొట్ట ఎక్కువగా ఉన్నవారు ఉత్తరేణి ఆకుల రసాన్ని నువ్వుల నూనె పోసి నూనె మిగిలే వరకు మరిగించి భద్రపరుచుకుని రోజూ పొట్టపై మర్ధన చేస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మంచి ఫలితం కనిపిస్తుంది.

పిప్పి పన్ను బాధ వేధిస్తుంటే ఉత్తరేణి సమూలం అంటే ఆకులు వేర్లు గింజలు మొత్తం దంచి రసం తీసి ఈ రసంలో దూది ముంచి పిప్పి పన్ను పిప్పి పన్ను నొప్పి తగ్గిపోతుంది.

శోభి మచ్చలు ఉన్నవారు ఉత్తరేణి మొక్కను వేర్లతో సహా పీకి ఎండబెట్టి కాల్చి బూడిద చేసుకొని దీన్ని వేప నూనెలో కలిపి మచ్చలపైన పైపూతగా పుస్తుంటే మచ్చలు తగ్గిపోతాయి.

ఉత్తరేణి వేరు దంత సమస్యలకు చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. వారానికి ఒకసారైనా ఉత్తరేణి ఉత్తరేణి వేరుతో పళ్ళు తోముకుంటే దంతాలు దృఢంగా మరి ఎలాంటి సమస్యలు రావు. ఉత్తరేణి ఆకులను నమిలి రసాన్ని పుక్కిట పడితే చిగుళ్ల నుండి రక్తం కారడం చిగుళ్ళవాపు నోటిపూత వంటివి తగ్గిపోతాయి.

మైగ్రేన్ తలనొప్పి బాధిస్తుంటే పక్వానికి వచ్చిన ఉత్తరేణి గింజలను ఎండబెట్టి పొడి చేసి ఈ పొడిని వాసన చూస్తుంటే పాశ్వాపు నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది. పూర్వం మునులు రుషులు తపస్సు సమయంలో ఆకలి వేయకుండా  ఉండటానికి  ఉత్తరేణి గింజలతో పాయసంగా  చేసుకొని తాగేవారట.

Leave a Comment

error: Content is protected !!