Real Faces behind our Sweat

చెమటలో దాగున్న గొప్ప నిజం

ఎక్కడికైనా వెళ్తామా మన పక్కన ఎవరైనా చెమట కారుతున్న మనిషి నిలబడుకుని ఉంటే ముక్కులకు కర్చీఫ్ అడ్డు పెట్టుకుని పక్కకెళ్లిపోతాం చెమట వాసన ఇబ్బందే, నిజమే కానీ ఆ చెమట ఒక మాట చెబుతోంది. నన్ను బయటకు రానివ్వని దేహాలు అన్ని తొందరలో జబ్బుల కు కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతాయని. మనం ఈ మాట కొట్టిపడేస్తాం కానీ లోతుగా విషయం తెలుసుకుంటే కచ్చితంగా మనం మన విషయంలో ఆలోచనలో పడిపోతాం.

చెమటతో ఏంటి పని??

మనకు చెమటతో ఎలాంటి పని లేదు కానీ చెమట పట్టకుంటే  మన శరీరం కు తరువాత జబ్బులు వచ్చి అవి మానలేక డబుల్ పని మాత్రం తప్పదని అనిపిస్తుంది.

      మన తాతయ్యలు, బామ్మలు చాలా ఆరోగ్యంగా దాదాపు వంద సంవత్సరాల ఆయుష్షు వరకు సంతోషం గా జీవించారు. వాళ్ళ కాలం లో ఎలక్ట్రానిక్ పరికరాలు లేవు, ఉన్నా ఏ పెద్ద కోటీశ్వరుల ఇళ్లలోనో ఉండేవి. అందుకే వారు ప్రతిపనీని సొంతంగా చేసుకునేవారు, బావిలో నీళ్లు తొడుకోవడం నుండి, పంటలు పండించడం, వంటకు కట్టెలు తెచ్చుకోవడం లాంటి పనులు బోలెడు చేసేవారు అంతేనా మన బామ్మలకు, తాతయ్యలకు సంతానం కూడా ఎక్కువే, వాళ్ళందరిని తామే దగ్గరుండి చూసుకుంటూ తమ రోజు వారీ పనులను కూడా సమర్థవంతంగా చేసుకునేవారు వాళ్ళు అంత పని చేసుకునేవారు కాబట్టే వారి శరీరం కూడా దృఢంగా ఉండేది. మనం తరచుగా చెప్పే చెమట చిందించాడు అనే మాట మన పెద్దవాళ్లకే వర్తిస్తుంది. అందుకే వాళ్ళు జీవితంలోనే కాదు ఆరోగ్యపరంగా కూడా గొప్ప జీవితాన్ని అనుభవించారు. మరి చెమటకు  దీనికి సంబంధమేంటి అంటారా??

చెమటలో మర్మం మన దేహ ధర్మం.

మనిషి శరీరంలో చిన్న పెద్ద రూపాల్లో మూడు కోట్లా యాభైలక్షల నాడులు ఉంటాయి. ఈ నాడులు శరీరం మధ్యలో ఉండే మూలాధార చక్రాన్ని కేంద్రం చేసుకుని అటునుండి కొన్ని నాడులు కిందకు, కొన్ని నాడులు పైకి, మరికొన్ని పార్శ్వభాగాలకు వ్యాపించి ఉంటాయి. ఈ మూడుకొట్లా యాభైలక్షల నాడులను ఆశ్రయించి శరీరం పైన వాటికి ముఖద్వారాలుగా మూడుకొట్లా యాభైలక్షల వెంట్రుకలు ఉంటాయి. 

       రోజూ మనం తినే ఆహారం ద్వారా, పీల్చే గాలి ద్వారా, తాగే నీటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే రోగకారక రసాయన వ్యర్థపదార్థాలు, జీర్ణక్రియలో మిగిలిపోయే మలినపదార్థాలు, వీటన్నింటినీ శరీరం ఎప్పటికప్పుడు మూడుకోట్ల యాభైలక్షల నాడుల ద్వారా మన చర్మ రంధ్రాల నుండి చెమట రూపంలో బయటకు పంపుతుంది. కాబట్టి మన శరీరంలో ఉన్న మలిన పదార్థాలు చెమట ద్వారా బయటకు వెళ్తే మనకు ఆరోగ్యం.

ఇప్పుడు జరుగుతున్నది ఏంటి??

ఇప్పట్లో శారీరక శ్రమ చాలా తగ్గిపోయింది. శ్రమ లేకపోవడం వల్ల మన శరీరం లో మలినపదార్థాలు బయటకు వెళ్లే అవకాశం లేక, సప్తధాతువులలోకి ఆ మలినపదార్థం చేరిపోయి, శరీరమంతా వ్యాపించి,  లెక్కలేనన్ని జబ్బులకు కారణం అవుతున్నాయి. అలాగే ప్రతి ఇంట్లో మరియు ఆఫీసులలో ఇరవైనాలుగు గంటలు ఫ్యాన్ లు, ఏసీ లు పని చేస్తుండటం తో మన చర్మరంధాల ద్వారా బయటకు పోవాల్సిన నూనె పదార్థాలు ఆరిపోయి  పేరుకుపోయి, మలినాలతో చర్యజరిపి చీముతో కూడిన మొటిమలు, కురుపులు ఏర్పడటానికి కారణం అవుతున్నాయి.ఇది చిన్న సమస్య అయితే శరీరంలో నిండిపోయిన మలినం వల్ల అనేక జబ్బులు వస్తున్నాయ్.

పరిష్కారం మన చేతుల్లోనే…

శారీరక శ్రమ తగ్గిపోవడం వల్ల వచ్చిన సమస్యకు పరిష్కారం గా అదే శారీరక శ్రమను తీసుకోవచ్చు. ప్రతిరోజు కనీసం ఉదయం మరియు సాయంత్రం గంట సేపు నడక లేక తోట పని లేదా ఇష్టమైన వ్యాపకాన్ని చేస్తూ మన శరీరానికి కాసింత పనిపెట్టడం వల్ల పేరుకుపోయిన మలినాలు చెమటద్వారా  బయటకు పోయి ఆరోగ్యాన్ని చేకూర్చుతాయి.

 అందుకే పెద్దలన్నారు ఎంత చెమట పడితే అంత ఆరోగ్యం అని. 

Leave a Comment

error: Content is protected !!