గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు విరివిగా లభిస్తూ, ప్రస్తుతం చాలా అరుదైపోయిన పండ్లలో నేరేడు పండు ఒకటి. వీటిని తినడం వల్ల కడుపు నొప్పి, డయాబెటిస్ మరియు ఆర్థరైటిస్‌కు చక్కని ఔషధంగా పని చేస్తుంది. ఈ పండు విరేచనాలు తగ్గడానికి మరియు అపానవాయువు వంటి జీర్ణ సమస్యలను కూడా నయం చేస్తుంది. నేరేడు పండుతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. కావాలంటే మీరే చదవండి.
హిమోగ్లోబిన్ స్థాయి మెరుగుపరుస్తుంది
విటమిన్ సి మరియు ఇనుముతో నిండి ఉన్న నేరేడు పండు హిమోగ్లోబిన్ ను పెంచుతుంది. , హిమోగ్లోబిన్ పెరగడం వల్ల అవయవాలకు సరఫరా అయ్యే రక్తం ఎక్కువ ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. ఇందులో ఉన్న ఇనుము రక్తాన్ని శుద్ధి చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది కూడా.
రక్తస్రావం ను ఆపుతుంది
నేరేడు పండు రక్తస్రావం ను ఆపుతుంది. ఇది చర్మం మీద మొటిమలను నయం చేయడంలో దోహదపడుతుంది. జిడ్డుగల చర్మం ఉన్నవారు నేరేడు పండు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా తాజాగా ఉండటంలో సహాయపడుతుంది.
చర్మం మరియు కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
ఈ పండు తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు మెరుగుపడటంతో పాటు ఇందులో ఉన్న ఐరన్ చర్మాన్ని, మరియు కళ్ల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ప్రముఖ పత్రం పోషిస్తుంది. ఇందులో అనేక ఖనిజాలు మరియు విటమిన్ సి మరియు ఎ ఉంటాయి. విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికి తెలిసినదే.
గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది
పొటాషియం సమృద్ధిగా ఉన్న నేరేడు పండ్లు తీసుకోవడం వల్ల గుండెకు ఎంతో మేలు చేస్తుంది. 100 గ్రాముల నేరేడు పండ్లలో 55 మి.గ్రా పొటాషియం ఉంటుంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి వ్యాధులను అదుపులో ఉంచడంలో ఈ పండు ఉపయోగపడుతుంది. ఇది ధమనులను ఆరోగ్యంగా ఉంచుతుంది కూడా.
చిగుళ్ళు మరియు దంతాలను బలంగా ఉంచుతుంది.
చిగుళ్ళు మరియు దంతాలకు నేరేడు పండు అద్భుతంగా పనిచేస్తుంది. నేరేడు చెట్టు ఆకులు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి చిగుళ్ళ నుండి కారే రక్తస్రావాన్ని నివారించడానికి ఉపయోగపడతాయి. నేరేడు ఆకులు మరియు లేత నేరేడు పుల్లలను అరబెట్టి బాగా ఎండిన తరువాత పళ్లపొడిలా వాడటం వల్ల చిగుళ్ళలో రక్తస్రావంను తగ్గించదసమే కాకుండా దంత సంబంధ సమస్యలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఈ చెట్టు బెరడు నోటి పూతల చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది. బెరడుతో తయారుచేసిన కషాయాలను ఉపయోగించడం ద్వారా తగ్గించుకోవచ్చు.
ఇన్ఫెక్షన్లు తగ్గిస్తుంది
నేరేడు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫెక్టివ్ మరియు యాంటీ మలేరియా లక్షణాలను కలిగి ఉంది. ఈ పండులో మాలిక్ ఆమ్లం, టానిన్లు, గాలిక్ ఆమ్లం, ఆక్సాలిక్ ఆమ్లం మరియు బెటులిక్ ఆమ్లం కూడా ఉన్నాయి. సాధారణ అంటువ్యాధులను నివారించడానికి ఈ పండు ప్రభావవంతంగా ఉంటుంది.
డయాబెటిస్‌కు చికిత్స చేస్తుంది
ఈ పండును మధుమేహం ఉన్నవాళ్లు తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే అధిక మూత్రవిసర్జన సమస్యతో బాధపడేవారు నేరేడు తింటే సమస్యను తగ్గించడంతో పాటు అతి దాహం ను నివారిస్తుంది. ఇది తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది, రక్తంలో చక్కెర స్థాయిలను సాధారణం చేస్తుంది. చెట్ల ఆకులు, బెరడు మరియు ఆకులను డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించవచ్చు.
చివరగా……
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చే ఈ పండును సీజన్ వారిగా తప్పకుండా తినడం వల్ల పై ప్రయోజనాలు సులువుగా పొందవచ్చు