ప్రస్తుత కాలంలో అమ్మాయిలు బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతున్న కారణాల్లో పిగ్మెంటేషన్ కూడా ఒకటి. మొహం మీద కొన్ని ప్రాంతాల్లో చర్మం ముదురు రంగులో మారడం, అది ఎబ్బెట్టుగా కనిపించడం వల్ల మొహంలో ఉన్న అందం తగ్గిపోయి కళావిహీనంగా కనబడేలా చేస్తుంటాయి. అసలు ఈ సమస్యకు కారణం ఏమిటి చూడండి మరి.
● చర్మపు మచ్చలు, మొటిమల గుర్తులు అన్నీ పిగ్మెంటేషన్‌కు కారణం కావచ్చు.
●జన్యువుల కారణంగా, పిగ్మెంటేషన్ సంక్రమిస్తుంది. కుటుంబంలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే ఆ కుటుంబంలోని వ్యక్తులు కూడా దానితో బాధపడవచ్చు.
● హార్మోన్ల మార్పులు, ముఖ్యంగా గర్భధారణ సమయంలో లేదా నెలసరి సమయంలో పిగ్మెంటేషన్‌కు గురవుతారు.
పిగ్మెంటేషన్ ముదురు గోధుమ రంగు మచ్చలుగా ఉంటుంది. ఈ ప్రదేశంలో ఉన్న చర్మంలో ఎక్కువ మృతకణాలు పేరుకుని పోయి ఉంటాయి. వీటిని తగ్గించుకోవడానికి కొన్ని మ్యాజిక్ ఇంటి చిట్కాలు
బంగాళాదుంప మరియు నిమ్మకాయ
బంగాళాదుంపలలో కాటెకోలేస్ అనే ఎంజైమ్ ఉంటుంది, ఇది పిగ్మెంటేషన్ కు బాగా పనిచేస్తుంది అలాగే నిమ్మకాయ సహజ బ్లీచ్ గా పేరొందింది. ఇది చర్మం మచ్చలను తొలగించడానికి సహాయపడుతుంది.
తురిమిన బంగాళాదుంప లో నిమ్మరసం కొద్దిగా కలపాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖం మీద ముఖ్యంగా పిగ్మెంటేషన్ కు గురైన ప్రాంతాల్లో అప్లై చేయాలి. దీన్ని దాదాపు అరగంట పాటు ఉంచుకోవాలి. నెలకు కనీసం రెండు సార్లు చేయడం వల్ల ఫలితం ఉంటుంది. తొందరగా తగ్గించుకోవాలనే ఆత్రం లో దీన్ని ఎక్కువగా వాడకూడదు కూడా.
నిమ్మరసం మరియు తేనె
తేనె చర్మానికి సహజంగా తేమ అందించి మృదువుగా చేస్తుంది.
రెండు స్పూన్ల తేనె, రెండు స్పూన్ల నిమ్మరసం బాగా కలిపి ముఖానికి పాక్ లా వేసుకోవాలి. దీన్ని దాదాపు 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీన్ని వారానికి ఒకసారి చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
విటమిన్ ఇ, బొప్పాయి మరియు ముల్తానీ మట్టి
విటమిన్ ఇ ఒక యాంటీఆక్సిడెంట్, ఇది సూర్యుని యొక్క అతినీలలోహిత కిరణాల యొక్క హానికరమైన ప్రభావం వల్ల ఏర్పడిన టాన్ ను తొలగిస్తుంది. ముల్తానీ మట్టిలో ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి, ఇవి చర్మాన్ని శుభ్రపరచడం, ఎక్స్ఫోలియేట్ చేయడం మరియు ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి, బొప్పాయిలో పాపైన్ ఎంజైమ్ ఉంటుంది, ఇది పిగ్మెంటేషన్ ను తొలగించి చర్మం తెల్లబడటానికి సహాయపడుతుంది.
విటమిన్ ఈ క్యాప్సల్, ముల్తానీ మట్టి రెండు స్పూన్స్, బొప్పాయి గుజ్జు టేబుల్ స్పూన్. వీటన్నిటిని కలిపి అవసరమైతే కొద్దిగా నీటిని జోడించి ఫేస్ పాక్ మిశ్రమాన్ని తయారుచేయాలి. దీన్ని పాక్ వేసుకుని సజమారు 20 నిమిషాల పాటు ఉంచుకొని తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీన్ని వారానికి ఒకసారి ప్రయత్నించాలి.
పసుపు మరియు పాలు
పిగ్మెంటేషన్ కోసం పసుపు ఉత్తమమైన ఇంటి నివారణలలో ఒకటి. ఇది అద్భుతమైన బ్లీచింగ్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, పాలు మచ్చలను తొలగించడం ద్వారా చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
పసుపు, పాలు రెండింటిని తగిన మోతాదులో తీసుకుని కలపాలి దీన్ని ముఖానికి పాక్ వేసుకుని 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ముత్యమంత మోము మీ సొంతమవ్వడానికి దీన్ని ప్రతిరోజు స్నానానికి అడగంట ముందు వేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు దీనివల్ల.
చివరగా……
పిగ్మెంటేషన్ అనేది నిర్లక్ష్యం వల్లనే ఎక్కువ అవుతుంది. వారానికి ఒకసారి మొఖాన్ని తాజాగా ఉంచుకోడానికి ఎదో ఒక నేచురల్ ఫేస్ పాక్ వేసుకుంటూ ఉంటే ముఖం మీద ఎలాంటి మచ్చలు, మొటిమలు, టాన్, పిగ్మెంటేషన్ లాంటివి దరిచేరవు.