Rheumatoid arthritis knee pain home remedies

విపరీతమైన మొకాళ్ళ నొప్పికి శాశ్వత పరిష్కారం…..

ఈ కీళ్ల నొప్పులు ఒకప్పుడు పెద్ద వాళ్లలో మాత్రమే కనబడేవి. కానీ!   ఈ మధ్యకాలంలో వయసుతో పని లేకుండా ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కీళ్ల నొప్పులు మరియు మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. సాధారణంగా మొకాళ్ళ నొప్పితో బాధపడే వారికి జాయింట్ దగ్గర వాపుగా ఉండీ అక్కడ ఉండే నేర్వ్ ఎండింగ్స్ కూడా నొప్పి వస్తుంది, మజిల్ స్టిఫ్నెస్ కూడా తగ్గుతుంది. అక్కడ కొంత నీటి శాతం  పెరిగి వాపు వస్తుంది. కొంత మందికి ఈ జాయింట్స్ దగ్గర జిగురు ఉత్పత్తి తగ్గి క్లాటేజ్ మీద ప్రభావం పడి అరుగుదల  జరిగి కొంత జరిగి నొప్పి వస్తుంది. 

                 ఇలాంటి మోకాళ్ళ నొప్పితో బాధపడేవారు తాత్కాలికంగా టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. కానీ బాహ్యంగా  కొంత ఉపశమనానికి, మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి కొన్ని రకాల ఆకులు పేస్టులు ఉపయోగపడతాయిఅలాంటి దానిలో ఒకటి అయిన కుప్పెంటాకు ఆకు పేస్ట్ ఒకటి. కుప్పింటాకులో ఔషధ గుణాలు చాలా మెండుగా ఉన్నాయి. ఈ కుప్పింటాకు లిఫోర్బియస్సీ కుటుంబానికి చెందింది. దీని శాస్త్రీయ నామం అఖలిఫా ఇండికా అంటారు. దీన్ని ఉపయెగించడం వల్ల లాభం ఉంది, నష్టం లేదు.

                 2017 సంవత్సరంలో  ప్రీ యూనివర్సిటీ అఫ్ మలేషియా దేశం వారు ఈ ఆకు మీద పరిశోధన చేసి, కుప్పెంటాకులో ఐదు రకాల కెమికల్ కాంపౌండ్స్ నరం ఎండింగ్స్ ని శాంతింప చేయడానికి, జాయింట్స్ లో వాపును తగ్గిస్తుంది మరియు మజిల్ రిలాక్సేషన్ కలుగుతుంది. అని ఈ పేస్ట్ అప్లై చేస్తే నొప్పులు బాగా తగ్గుతాయి అని రీజన్ ఇచ్చారు. ఈ కుప్పెంటాకు పేస్ట్ వాడడం వల్ల నొప్పి తగ్గడంతో పాటు వాపు కూడా తగ్గుతుంది. ఇది మార్కెట్లో మనకు  ఆయుర్వేద షాపులో దొరుకుతుంది.ఆ కుప్పెంటాకు పేస్ట్ 5 చిన్న టీ స్పూన్లు తీసుకుని, దీనికి నల్ల జీలకర్రను పేస్ట్ రెండు స్పూన్లు వేసి ఈ రెండు పేస్ట్ లను కలిపి మోకాలు చుట్టూ పూసి ఒక అరగంట ఉంచాలి. 

           ఇలా చేసిన తరవాత వేడినీళ్లు కాపడం పెట్టాలి. ఇలా రెండు పూటలు అప్లై చేస్తే మంచి ఫలితం కలగడమే కాకుండా నేచురల్ గా ఉపశమనం కలుగుతుంది. కేవలం ఈ కుప్పెంటాకు కీళ్ల నొప్పులు కే కాకుండా పంటి నొప్పికి ,తలనొప్పికి… బాగ ఉపయోగపడుతుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. 

Leave a Comment

error: Content is protected !!