బీ-కాంప్లెక్స్ విటమిన్లు శరీరానికి చాలా అవసరమైనవి. బి కాంప్లెక్స్ లోపం వస్తే శరీరంలో నీరసం, అలసట,కాళ్ళు పట్టేయడం వంటివి వస్తాయి. శరీరం చాలా వీక్ అయిపోతుంది. అసలు బి కాంప్లెక్స్ లోపం ఎందుకు వస్తుంది అంటే మనం తినే ఆహారం బియ్యం, పప్పులు పాలిష్ చేసినవి తినడం వలన, వంటలు చేసినప్పుడు కడిగినప్పుడు, ఉడికించినప్పుడు పదార్థాలలో ఉండే విటమిన్ బి నీటిలో కరిగే లక్షణం వల్ల కరిగి బయటకు పోతుంది.
అలాగే విటమిన్ అంటే నీటిలో కరిగే లక్షణం ఉంటుంది రోజు మనం తీసుకునే పదార్థాల ద్వారా లభించిన విటమిన్ బి మన శరీరానికి సరిపడా ఉపయోగించిన తరువాత మిగిలినది మలమూత్రాల ద్వారా బయటకు పోతుంది. ఎక్కువగా ఉన్న విటమిన్ బి ని శరీరంలో నిల్వ ఉంచుకోదు. ఈ విటమిన్ బి ప్రతిరోజు ఆహారం ద్వారా అందించాల్సి ఉంది. మనం తినే ఆహారంలో విటమిన్ బి లేకపోతే శరీరంలో విటమిన్ డి లోపం ఏర్పడితే టాబ్లెట్స్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది.
శరీరంలో కణాల నిర్మాణానికి పోలిక యాసిడ్ గర్భవతులు బాలింతలకు చాలా అవసరం. ఎందుకంటే గర్భవతుల్లో శిశువు నిర్మాణానికి పోలిక్ యాసిడ్ అవసరమవుతుంది. కొత్త కణాల నిర్మాణం జరగనిదే బిడ్డ ఏర్పడడం జరగదు కదా. అందుకే పోలిక్ యాసిడ్ అనేది చాలా ముఖ్యమైన విటమిన్. ఒక రోజుకు 400 మైక్రోగ్రాముల విటమిన్ మామూలు మనుషులకు కావాలి. అదే గర్భవతులకు 600 నుండి 800 మైక్రోగ్రాముల విటమిన్ బి కావాలి.
316 మైక్రోగ్రాముల ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది నేషనల్ న్యూట్రిషన్ ఇన్స్టిట్యూట్ వారు ఇచ్చిన సమాచారం. రాజ్మా వంద గ్రాములు తీసుకుంటే అందులో 100 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది చీప్ అండ్ బెస్ట్ ఆహారం. 300 గ్రాముల క్యాలరీలు కూడా రాజ్మా లో లభిస్తాయి. రాజ్మా కొంచెం గట్టిగా ఉండే గింజలు. వీటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే కుక్కర్లో వేసి అన్ని కూరలలో కలిపి తీసుకోవచ్చు. దీంట్లో లభించినంత ఫోలిక్ యాసిడ్ వేరే ఇతర ఏ పదార్థాలలోనూ లభించదు.
ప్రతి కూరలో రాజ్మా కలపడం వలన రుచితో పాటు విటమిన్ బి కూడా సమృద్ధిగా అందుతుంది. ఎదిగే పిల్లల్లో కణాల నిర్మాణం జరగాలి కనుక వారికి, గర్భిణీలకు, బాలింతలకు, ఆటలు ఆడేవారికి, బాడీ బిల్డర్లకు ప్రోటీన్ల కోసం రాజ్మా తీసుకోవడం చాలా మంచిది. దీనిని చాట్లో కలిపి సలాడ్స్లో కలిపి తీసుకోవచ్చు. ఇలా తరచూ తీసుకోవడం వలన శరీరంలో విటమిన్ బి, పోలిక్ యాసిడ్ లోపం ఏర్పడకుండా ఉంటుంది. శరీరానికి కావలసిన ప్రొటీన్లు కూడా సమృద్ధిగా లభిస్తాయి