Saraswathi Mokka Improve Memory Power

పిల్లల నుండి పెద్దల వరకు అందరి జ్ఞాపకశక్తికి గొప్ప బూస్టింగ్ ఇచ్చే ప్రాచీన ఆయుర్వేద చిట్కాలు.

ఇప్పట్లో చాలా మందిని వేధించే సమస్య ఏదైనా సరే గుర్తుపెట్టుకోలేకపోవడం. చాలా మంది దీన్ని మతిమరుపు అంటారు. కానీ మతిమరుపు వయసు రీత్యా ఎదురయ్యే సమస్య. మరి చిన్న వయసు వారికి కూడా ఆ సమస్య ఎదురైతే జ్ఞాపకశక్తి లేకపోవడం, మెదడులో జ్ఞాపకశక్తి కణాలు తగినంత చురుగ్గా లేకపోవడం జరిగినట్టు. ఇలా చిన్న వయసులో సమస్య ఉన్నవారికె కాదు, జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న పెద్దవారికి కూడా తిరిగి మెదడులో కణాలను ఉత్తేజం చేసి చురుగ్గా అన్ని జ్ఞాపకం ఉంచుకునేలా చేసే అద్భుతమైన చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి. మరి అవేంటో చదివేయండి. మొద్దుబారిన  మీ మెదడును షార్ప్ గా మార్చేయండి. 

◆ ఆవు నేతికి జ్ఞాపకశక్తిని పెంపొందింపచేసే గుణం వుంది. అది కూడా తాజా ఆవు నెయ్యి కంటే బాగా పాతబడిన ఆవు నెయ్యిని మందులుగా 1 చెంచా చొప్పున రెండు పూటలా రోజూ తీసుకోవాలి. ఎంత పాతబడిన అవి నెయ్యి వాడితే అంత గొప్ప ఫలితం చాలా తొందరగా ఉంటుంది. 

◆ఉసిరికాయ ( సంస్కృతంలో ఆమలకి అంటారు)ని తొక్కుడు పచ్చడి (నల్లపచ్చడి) గా తయారు చేసుకొని రోజూ రెండుపూటలా అన్నంతో మొదటి మూడు ముద్దలు తినాలి. ముఖ్యంగా విద్యార్థులకు ఇది బాగా మేలు చేస్తుంది.

 ◆ఆమలకి రసాయనం అనే పేరుతో ఆయుర్వేద మందుల షాపులో మంచి రుచికరమైన ఔషధం దొరుకుతుంది. దీనిని ఉసిరికాయతోనే తయారుచేస్తారు దాన్ని తినిపిస్తే జ్ఞాపకశక్తి ఆమోఘంగా పెరుగుతుంది.

 ◆ఎంతో ఖరీదైన దినుసు కుంకుమ పువ్వు. మంచి క్వాలిటీ దొరికితే జ్ఞాపకశక్తి తక్కువగా వున్న వారికి తినిపించాలి. పెద్దగా కష్టపడక్కర్లేదు  దీన్ని తినిపించడానికి. తేనెతో కలిపి పెట్టడమే రోజూ 1 రేకు సరిపోతుంది. రుచి కూడా ఎంతో కమ్మగా ఉంటుంది. ఇది  జ్ఞాపకశక్తిని బాగా పెంచుతుంది. అందుకే గర్భవతులు కుంకుమ పువ్వును పాలలో కలిపి తీసుకోమని చెబుతారు. కడుపులో బిడ్డ రంగే కాదు తెలివికోసం కూడా.

 ◆ మాంసాహారం తినేవారు కోడిపుంజు మాంసంను తీసుకుంటూ ఉండాలి. అందులో ఉన్న పోషకాలు మెదడు కణాలను చురుగ్గా తయారుచేస్తాయి.  

* అక్కల కర్ర అనే మూలిక కొంచెం ఖరీదైనదే గాని మూలికలు అమ్మే షాపుల్లో దొరుకుతుంది. ఇది ఉప్పగా, పుల్లగా, వగరు రుచులతో కలిగి ఉంటుంది. దీన్ని బాగా మెత్తగా దంచి, 1/4 చెంచా పొడివరకూ రెండుపూటలా తేనెతో కలిపి తినిపిస్తే జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది.

◆త్రిఫలచూర్ణం అందరికి తెలిసినదే గాక, అందరికి అందుబాటు ధరలో ఉంటుంది కూడా. ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. దీన్ని తప్పనిసరిగా రోజూ 1/2 చెంచా నుంచి 1 చెంచా వరకు నేరుగాగాని, పాలలో కలిపిగాని, కషాయం కాచుకొని గానీ తీసుకోవాలి. జ్ఞాపకశక్తిని పెంచే గొప్ప గుణం దీనికుంది.

◆ తమలపాకులు అన్నిచోట్లా లభిస్తాయి. ఈ ఆకులను దంచి తీసిన రసంలో తేనె కలుపుకొని తాగితే మతిమరుపు తగ్గుతుంది. చదువుకొనే విద్యార్థులకు కూడా పరీక్షల రోజుల్లో తాగించడం మంచిదే!

◆ దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి ఈ మూడింటికి బుద్ధినీ, తెలివితేటల్నీ జ్ఞాపకశక్తిని పెంచే శక్తి వుంది. వీటిని తీసుకుంటూ ఉంటే గొప్ప ఫలితం ఉంటుంది.

◆గుంటగలగర మొక్క పొలాల గట్లన, కాలువ గట్ల పక్కన పెరిగే మొక్క. పల్లె ప్రాంతాలలో చాలా తేలికగా దొరుకుతుంది. దీన్ని శుభ్రం చేసి, ఎండించి, మెత్తగా దంచి ఆ పొడిని రోజూ మూడు వేళ్ళకు వచ్చినంత తీసుకుని నోట్లో వేసుకుని చప్పరించి తినాలి. ఉట్టిది తినలేని వారు, ఆ పొడికి కొద్దిగా పటిక బెల్లం కలుపుకోవచ్చు. దీన్ని విడవకుండా 3 లేదా 4 నెలలు వాడితే చాలు. మెదడు సూపర్ కంప్యూటర్ లా మారుతుంది. అలాగే కంటి ఆరోగ్యం మెరుగవుతుంది. కళ్ళజోడు వాడేవారు దీన్ని పాటిస్తే తరువాత ఇక కళ్ళజోడు అవసరమే లేదని చెబుతారు కూడా.  

◆విద్యార్థులు కూడా ఎలాంటి భయం అక్కర్లేకుండా సరస్వతి లేహ్యం లేదా సరస్వతి పొడి ని తీసుకోవచ్చు. ఇది ఎంతో గొప్ప మేధస్సును చేకూరుస్తుంది. 

చివరగా…

పైన చెప్పుకున్న అద్భుతమైన ఆయుర్వేద ఔషధాలు మెదడును చురుగ్గా చేయడంలో దోహదపడినా, మానసిక ప్రశాంతత కోసం తగిన ధ్యానం, యోగ వంటివి మరింత ఉత్తేజాన్ని నింపుతాయి. కాబట్టి రెండింటిని మరవకండి.

Leave a Comment

error: Content is protected !!