Shatavari Asparagus racemosus plant benefits

శత ఆయుష్షును ఇచ్చే శతావరిలో నమ్మలేని నిజాలు.

పల్లెల్లో చేల గట్ల వెంట పెరిగే తీగ జాతికి చెందిన మొక్క శతావరి. దీన్ని స్థానిక భాషలో పిళ్లిపీచర గడ్డలు, పిల్లితీగలు, చందమామ గడ్డలు అనే పేర్లతో పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ” యాస్పరేగస్ రెసిమొసిస్”. ఇది చేల గట్ల వెంట పెరిగే తీగజాతి ముళ్ల మొక్క. దీనివల్ల పంటలకు చేలకు పశువుల నుండి చాలా రక్షణ ఉండేది. ఇక ఆయుర్వేద పరంగా శతావరి ని చాలా విధాలుగా వాడతారు. శతావరిలో ఏముందో చూద్దాం ఒకసారి.

తీగజాతికి చెందిన శతావరిలో ముఖ్యమైనది దుంపలు. బంగాళదుంప, ముల్లంగి, క్యారెట్ లాగా శతావరి కూడా భూగర్భంలో దుంపలు కలిగి ఉంటుంది. ఈ దుంపలు తీపి మరియు చేదు రుచిని కలిగి ఉంటాయి. శతావరి దుంపల్లో స్టెరాయిడల్ గ్లైకోసైడ్ , పొలిసైక్లిక్ ఆల్కలాయిడ్, అస్పరగమైన్-ఎ, డై హై డ్రోఫెనామ్ త్రీన్ రెసిమొసోల్ మొదలగు రసాయనాలు పుష్కలంగా ఉంటాయి. శతావరిని మనం ఔషధంగా వాడినపుడు పైన చెప్పుకున్న రసాయనాలు మన శరీరంలో ఉన్న అసమతుల్యతలను తొలగించి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. నిజానికి శతావరి అంటే అర్థం వంద జబ్బులను మాయం చేయగల సామర్థ్యం కలిగి ఉండటమే.

మరి అలాంటి శతావరి తో కొన్ని ఆరోగ్య సమస్యలు పరిష్కారాలు చూద్దాం.

◆ శతావరి చూర్ణాన్ని రోజు నీటిలో కలిపి తీసుకోవాలి. ఒక స్పూన్ శతావరిని ఒక చిన్న టీ గ్లాస్ నీళ్లలో కలిపి తాగాలి దీనివల్ల అల్సర్లు, గ్యాస్ట్రిక్ సమస్య సులువుగా పరిష్కరించబడతాయి.

◆ ఈ శతావరి చెట్టు వేరును సేకరించి దాన్ని గంధంలాగా తీసి కీళ్లనొప్పులు మరియు నరాల బలహీనత ఉన్న ప్రదేశంలో లేపనం చేయాలి. దీని వల్ల ఉపశమనం మాత్రమే కాకుండా ఆయా భాగాలు దృఢంగా కూడా తయారవుతాయి.

◆ కిడ్నీ సంబంధిత వ్యాధులు ఉన్నవారు  శతావరి చూర్ణాన్ని రాత్రి పడుకునే ముందు కాసింత కండచెక్కెర(కలకండ) కలిపి తీసుకోవడం వల్ల మూత్ర సంబంధ వ్యాధులు అన్ని నయమవుతాయి. అలాగే ఈ చిట్కా కంటిచూపును కూడా మెరుగుపరుస్తుంది.

◆శతావరిని రోజు తీసుకోవడం వల్ల జీర్ణశక్తి సామర్థ్యము పెంపొందుతుంది దీనివల్ల జీర్ణసంబంధ సమస్యలు అన్ని నివారించబడతాయి.

◆శతావరి దుంపలు పౌష్టికాహార లోపం ఉన్నవారికి వరమే అని చెప్పుకోవచ్చు. ఈ దుంపలు ఎండబెట్టి దంచి జల్లించి చూర్ణం తయారుచేసుకుని స్పూన్ చూర్ణం తిని ఒక గ్లాసుడు పాలు తాగాలి. దీనివల్ల శరీరం పుష్టిగా తయారు అవుతుంది.

◆ స్త్రీలకు సంబంధించిన ఋతు సమస్యలు మరియు గర్భాశయ సమస్యలకు శతావరి చూర్ణం అద్భుతంగా పని చేస్తుంది. ప్రతిరోజు శతావరిని ఏదో ఒక సమయంలో ఆహరానికి గంట ముందుగా తీసుకోవడం వలన పలితం ఉంటుంది. 

◆ అలాగే శతావరిని రాత్రిపూట తీసుకోవడం వలన చక్కని నిద్ర సొంతమవుతుంది.

చివరగా……

ఇంత చక్కని ఫలితాలను ఇచ్చే శతావరిని చూర్ణం, గుళికలు(టాబ్లెట్స్), లేహ్యం మొదలైన విధాలుగా రోజువారీ తీసుకుంటే  ఆనందకరమైన  జీవితం మన సొంతమవుతుంది. 

Leave a Comment

error: Content is protected !!