Significance of Ashada Masam

కొత్తగా పెళ్లి అయిన వారు ఆషాఢమాసంలో ఎందుకు కలవకూడదో తెలుసా!

ఆషాడమాసంలో కొత్త కోడలు అత్త వారి ఇంట్లో ఉండకూడదు అని పుట్టింటికి  పంపిస్తారు. దానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  ఆషాడ మాసంలో ఎట్టి పరిస్థితుల్లోను పెళ్లిళ్లు జరుపరు.కావాలంటే  వాయిదా వేసుకుంటారు. కానీ ఈ మాసంలో మాత్రం పెళ్లిళ్లు చేయరు.   ఆషాడం అంటే ఆది  అని  అర్థం. ఆది అంటే శక్తి అని అర్థం. ఆషాడమాసంలో దేవతలను ఎక్కువగా పూజిస్తుంటారు. దేవాలయాలు కిటకిటలాడుతూ ఉంటాయి.  పూజలు, వ్రతాలు, యాత్రలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అందువల్ల   పురోహితులకు అసలు పెళ్లిళ్లు జరిపే  కాళీ ఉండదు.

కాబట్టి ఇది ఒక కారణంగా ఆషాఢ మాసంలో పెళ్లిళ్లు చేయరు. ఉత్తరాయణ దక్షిణాయన కథల ప్రకారం  శ్రీ మహావిష్ణువు  ఆషాడంలో నిద్రలోకి వెళ్తారని ఆయన ఆశీస్సులు లభించవని  పెళ్ళిళ్ళు చేయరు. ఆషాడ మాసం వచ్చింది అంటే  కొత్తగా పెళ్లి అయిన కోడలు అత్త వారి ఇంట్లో ఉండకూడదు. అందుకే పుట్టింటికి పంపిస్తారు. ఆషాడ మాసంలో భార్య భర్తలు అంటే కొత్త జంటలు కలవకూడదని అందరూ ఒక అది ఒక మూఢ నమ్మకం అని అనుకుంటూ ఉంటారు. 

ఆషాడ మాసం గ్రీష్మరుతువు  ఈ రుతువులో  వానలు వస్తూ ఉంటాయి. పూర్వకాలం వ్యవసాయమే  జీవనాధారం. కాపురం మోజులో పడి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తే సంవత్సర మొత్తం కడుపు మాడాల్సి వస్తుందని కోడల్ని పుట్టింటికి పంపిస్తారు. ఆషాడ మాసంలో వర్షాకాలం మొదలై వాతావరణ పరిస్థితులు మరియు వాతావరణం చల్లగా ఉంటుంది. దీని వల్ల  బ్యాక్టీరియా, అంటువ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ త్వరగా వ్యాపిస్తాయి. జలుబు కూడా తరచుగా వస్తూ ఉంటుంది. ఈ సమయంలో కొత్త కోడలు గర్భం ధరిస్తే పుట్టబోయే బిడ్డకు కూడా ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని కోడల్ని పుట్టింటికి పంపిస్తారు.

కడుపులో బిడ్డకు మొదటి మూడు నెలలు చాలా ముఖ్యం. ఆ సమయంలోనే అవయవాలు ఏర్పడతాయి. వాతావరణ పరిస్థితుల వలన బిడ్డకు  ఏదైనా ఇబ్బంది కలుగుతుందని భయంతో కోడల్ని పుట్టింటికి పంపిస్తారు. శ్రావణంలో వ్రతాలు, నోములు జరుగుతాయి.  దాదాపు అన్ని మంచి రోజులే ఉంటాయి. కాబట్టి మొదటి పుట్టబోయే బిడ్డ మంచి రోజుల్లో గర్భం ధరిస్తే మంచిదని  ఆషాడంలో కొత్త కోడలుని పుట్టింటికి పంపడం జరుగుతుంది. అలాగే కొత్తగా పెళ్లయిన అమ్మాయికి పుట్టింటి మీద బెంగ ఉంటుంది. ఈ కారణంగా ఒక నెల ఉండటం వలన బెంగ  కూడా తగ్గుతుందని ఇలాంటి ఆచారాన్ని పెట్టారు. 

కొత్తగా పెళ్లయినా జంటకు ఎడబాటు రావడం వలన అన్యోన్యత పెరుగుతుందని ఆషాడంలో దూరంగా ఉంచుతారు. ఆషాడంలో గర్భం దాల్చితే సరిగ్గా పురుడు వచ్చే సమయానికి ఎండాకాలం వస్తుంది. ఆ సమయంలో బిడ్డ మరియు తల్లి కూడా ఎండకు తట్టుకోలేరని ఇలాంటి ఒక ఆచారం పెట్టారు. పూర్వం  కొత్త అల్లుడు అత్త గారింట్లో ఆరు నెలల పాటు ఉండే వాడు పనులు చేయాల్సిన కొడుకు అత్తవారింట్లో ఉంటే సరైన సమయానికి విత్తనాలు  జళ్లకపోతే సంవత్సరం అంతా కడుపు మడాల్సిందే అని  ఆషాడమాసంలో కొత్త అల్లుడు అత్తగారి  ఇంటి వైపు చూడకూడదు అని ఆచారాన్ని పెట్టారు.

Leave a Comment

error: Content is protected !!