వర్షాకాలం, చలికాలం వచ్చిదంటే పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరకూ వైరల్ ఇన్ఫెక్షన్ ల దాడి ఎక్కువయిపోతుంది. గుండెల్లో కఫం చేరి దగ్గు ,జలుబు జ్వరంలా మనల్ని బాధపెడతాయి. ఒక్కోసారి పిల్లల్లో ఇన్ఫెక్షన్లా మారతాయి. జలబు, దగ్గు, జ్వరం ,ఫ్లూల నుండి రక్షించుకోవడానికి ఆయుర్వేదంలో అనేక ఇంటిచిట్కాలు ఉంటాయి. వాటిని ఉపయోగించి జలుబు, దగ్గుల నుండి ఎలా బయటపడాలో చూద్దాం. దీనికోసం మనం పది తులసి ఆకులను తీసుకుని శుభ్రంగా కడిగి రోట్లో కానీ, మిక్సీలో కానీ కొద్దిగా నీటిని వేసుకుని తులసిఆకులు రుబ్బుకుని రసం తీసుకోవాలి. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.
దీనిని రెండు చెంచాలు తీసుకుని అందులో పెద్దలకు అయితే నాలుగు లేదా ఐదు మిరియాలు, పిల్లలు కోసం అయితే రెండు మిరియాలు తీసుకుని పొడి చేసుకోవాలి. తులసిరసంలో కలుపుకోవాలి. ఒకస్పూన్ తేనె తీసుకుని ఈ మూడింటిని బాగా కలుపుకోవాలి. దీనిని తీసుకోవడం వలన ఈ మూడింటిలో ఉండే ఔషధగుణాలు వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా వైరల్ ఇన్పెక్షన్లనుండి కాపాడతాయి. జలబు, దగ్గులతో బాధపడుతుంటే ఈ మిశ్రమాన్ని రోజులో మూడు, నాలుగు సార్లు ఒక స్పూన్ రసం తీసుకోవాలి.
ఈ రసం వలన ఎంతటి భయంకరమైన జలుబు, దగ్గు, జ్వరమైనా ఒక్క రోజులో తగ్గిపోతుంది. కడుపులో పెరిగే ఏలికపాములు లాంటి క్రిములను తులసి నిర్మూలిస్తుంది. జీర్ణశక్తిని మెరుగుపరిచి ఉదర సంబంధ వ్యాధులను దూరం పెడుతుంది. రక్తహీనత, ఉబ్బసానికీ తులసి అందుబాటులో ఉండే ఔషధం. పిల్లలకు తులసిరసం పోయడం వలన ఊపిరితిత్తులలో చేరిన కఫాన్ని కరిగించి ఆకలి వేయడానికి సహకరిస్తుంది. మిరియాలు లాలాజలం ఊరేలా చేసి జీర్ణక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది. శరీరంలో వేడిని పెంచి బయట చలివలన ఏర్పడే సమస్యలు తగ్గేందుకు దోహదపడుతుంది.
రక్తప్రసరణ వేగవంతం చేసి గుండె పనితీరుకు సహకరిస్తుంది. యాంటీ బాక్టీరియల్‌గా పనిచేసి వైరల్ ఇన్ఫెక్షన్ ల నుండి రక్షిస్తుంది. తేనె శ్వాసకోశ వ్యాధులను తగ్గించడంలో బహు ప్రయోజనకారి. ఆహారవాహిక ఇన్ఫెక్షన్ ల నుండి, ఊపిరితిత్తులలో చేరిన కఫాన్ని కరిగించడంలో అద్బుతంగా పనిచేస్తుంది. అజీర్తి, విరేచనాలు తగ్గించి గ్యాస్ సమస్య తగ్గడానికి సహకరిస్తుంది. ఈ చిట్కాల ద్వారా ఆయుర్వేదం అందించిన సహజ ఔషధాలతో జలబు, దగ్గులను దూరం చేసుకుందాం.