simple home remedy for joint pain and arthritis

జాయింట్ పెయిన్స్, నడుం నొప్పి, ఎముకలు, నరాల బలహీనతతో నడవలేని వారిని కూడా పరిగెత్తించే అద్భుతమైన టిప్

ప్రస్తుతం ఉన్న కాలపరిస్థితుల్లో ఎముకలు అరగడం, ఎముకలు విరగడం నడుము నొప్పి కీళ్ల నొప్పులు ఎంతగానో వేధిస్తుంటాయి. ఈ పరిస్థితి ఎక్కువగా మధ్య వయసు వారిలో అధికంగా ఉంటుంది. మారుతున్న ఆహార అలవాట్లు, కాలాన్ని అనుసరించి తీసుకునే ఆహారంలో మార్పు చేర్పులు చేసుకోకపోవడం, సమయపాలన లేకపోవడం, రసాయన మయమైన పంటలు మొదలైనవాన్ని కూడా వీటికి కారణం అవుతుంటాయి.

అంతేకాక చిన్నపిల్లల ఎముకలు దృఢంగా ఉండడానికి వయసు పెరిగిన తరువాత కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఒక అద్బుతమైన చిట్కా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే దీన్ని పాటించడం వల్ల ఎన్నో రోజులుగా ఇబ్బంది పెడుతున్న నరాల సమస్యలు, కీళ్ల నొప్పులు వంటివి తగ్గడమే కాకుండా ఎముకల ఆరోగ్యం అనూహ్యంగా పెరిగి ఎంతో శక్తివంతులు అవుతారు. 

కావలసిన పదార్థాలు:

  • పాలు
  • తెల్ల నువ్వులు
  • పటికబెల్లం లేదా తాటి బెల్లం
  • వాము 
  • ఎండు కొబ్బరి

పనిలోపనిగా ఇందులో ఉపయోగించిన పదార్థాల పోషకాలు ఒకసారి చూడండి :పాలు తాగడం వలన మన శరీరానికి ఎంతో శక్తి ని కలిగిస్తుంది అంతే కాకుండా అనేక పోషక విలువలు కలిగి ఉంటాయి. సొంపు దీనిని తీసుకోవడం వలన ఎముకలు ఎంతో గట్టిగా ఉంటాయి అంతే కాకుండా జీర్ణ వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తుంది తెల్లనువ్వులు ఎముకలకు గట్టిదనం పెంచుతాయి ఇందులో కాయల్షియం ఎక్కువగా ఉంటుంది మరొక పదార్థం కొబ్బెర ఈ ఎండు కొబ్బరి శరీరంలోని వేడిని తగ్గిస్తుంది మరియు ఎముకలకు గట్టిదనం పెంచుతాయి.

తయారీవిధానం:

 మొదట పాలు ఒక్క గ్లాసు తీసుకోవాలి అవి బాగా కాగిన తర్వాత అందులో ఒక్క చెంచా సోంపును కలిపి కాస్త వేడి చెయ్యాలి తర్వాత ఒక్క మిక్సి జార్ తీసుకుని అందులో కాస్త కొబ్బెర ముక్కలు, రెండు చెంచాల నువ్వులు, పటిక బెల్లం కలిపి కాస్త మెత్తగా వేసుకోవాలి. ఈ పొడిని బాగా కాగిన పాలలో రెండు చెంచాలు కలుపుకోవాలి. దీనిని పడుకునే సమయంలో ఒక్క గ్లాసు తీసుకోవాలి. దీనిని తీసుకోవడం వలన ఎముకల వలన కలిగే ఇబ్బందులని మనం సులభంగా ఎదుర్కోగలం. దీనిని ఎటువంటి వయసు వారైనా తీసుకోవచ్చు పిల్లలు సైతం దీనిని తీసుకొని ఎముకల దృడత్వాన్ని పెంచుకోవచ్చు. దీనిని తీసుకోవడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. మరింకేం ఆలస్యం సమస్య ఉన్నవాళ్లకు పరిష్కారం దొరికిందిగా పాటించేయండి.

Leave a Comment

error: Content is protected !!