అధిక బరువు సమస్య తో అందరిలోనూ అవహేళనల పాలవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. బరువు తగ్గించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. డైట్ ఫాలో అవడం, యోగా, వ్యాయామంతో పాటిస్తారు. వాటిలో పాటు ఇంట్లోనే తయారుచేసుకునే ఒక డ్రింక్ అధికబరువు సమస్యను త్వరగా తగ్గిస్తుంది. మార్కెట్లో దొరికే ప్రోడక్ట్స్ వలన బరువు సమస్య తాత్కాలికంగా తగ్గొచ్చు. కానీ దుష్ప్రభవాలు ఉంటాయి. ఒక గిన్నెలో ఒకగ్లాసు నీళ్ళు పోసి అందులో తురిమిన లేదా కట్ చేసిన కమాలా తొక్కల ముక్కలను వేయాలి. ఈ డ్రింక్ వలన రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనికోసం నాలుగు పదార్థాలు తీసుకోవాలి.
కమాలాపండూ తొక్కను సన్నగా తురమాలి లేదా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఈ డ్రింక్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఫైబర్, విటమిన్ సి అధికంగా ఉండడంవలనవ్యాధినిరోధక శక్తి పెరగడమే కాకుండా అధికబరువు తగ్గి కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. జీర్ణసంబంధ సమస్యలు తగ్గిస్తుంది. జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేలా అయితే అది కొవ్వులా మారకుండా శక్తి లా మారేలా చేస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా ఉండడంవలన చర్మసమస్యలకు చాలా బాగా ఉపశమనం కలిగిస్తుంది. చర్మంలో కొలాజిన్ ఉత్పత్తి ని పెంచి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.చాలామందిలో కీళ్ళనొప్పులు చాలా వేధిస్తున్నాయి.
అధికబరువు వలన వచ్చే కీళ్ళనొప్పులు తగ్గించడంలో దోహదపడుతుంది. దీంట్లో రెండు లవంగాలు వేయాలి. లవంగాలు తిన్న ఆహారం సరిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. జీర్ణసంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది. తిన్న ఆహారం శక్తిగా మారేలా తోడ్పడుతుంది. బరువు తగ్గడానికి లవంగాలు చాలా బాగా సహాయపడతాయి. దీంట్లో రెండు యాలకులు వేయాలి. ఈ నీటిని తాగడంవలన ముఖం కాంతివంతం అవుతుంది. ఒత్తిడిని తగ్గించి ఒత్తిడి వలన ఎక్కువ ఆహారం తీసుకోకుండా అడ్డుకుంటుంది. మంచినిద్ర పట్టేలా చేస్తుంది. మెదడు ఆరోగ్యానికి కూడా మంచిది. ఈ నీటిని తక్కువ మంటలో మరిగించి తాగాలి. ఈ నీటిని తాగడంవలన మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరంలో ని విషవ్యర్థాలను బయటకు పంపుతుంది.
ఈ నీళ్ళు రంగుమారగానే మంటకట్టేసి నీటిని వడకట్టాలి. ఈ నీటిలో అరస్పూన్ తేనె కలపాలి. తేనెలో ఉండే ప్రోటీన్లు, విటమిన్లు శరీరానికి అవసరమైన తక్షణ బలాన్ని అందిస్తాయి. ప్రక్టోస్ అనే షుగర్ తేనెలో ఉంటుంది. ఇది రక్తంలో త్వరగా కరగకుండా నెమ్మదిగా కరుగుతూ చాలా సమయం ఆకలిని నిరోధిస్తుంది. దీనివలన అధిక బరువు పెరగరు. ఈ నీటిని ఉదయం, సాయంత్రం తాగాలి. ఇలా పదిరోజులపాటు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ శరీరాన్ని శుభ్రపరచడంలో కూడా సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్నవారు తేనె లేకుండా తాగాలి. ఇలా వ్యర్థం అనుకునే కమలాపండు తొక్కలనుండి ఇన్ని ప్రయోజనాలు పొందవచ్చు.
మరింంత సమాచారం తెలుసుకోవడానికి క్రింద లింక్ చూడండి