ఈ మధ్య కాలంలో పల్లెటూర్ల తో పోలిస్తే పట్టణ ప్రాంతాలలో ఊబకాయం సమస్య బాగా పెరిగింది. ఈ సమస్యకు ముఖ్య కారణం మారిపోయిన ఆహారపు అలవాట్లు, ఆహార పదార్థాలు, జీవనశైలి, వ్యాయామం చేయని పనివేళలు, నిద్ర సరిగ్గా పోకపోవడం ఇటువంటివన్నీ ఊబకాయం సమస్యకు కారణమవుతున్నాయి. అయితే ఊబకాయం అన్ని రకాల అనారోగ్య సమస్యలను తీసుకొస్తుంది. సాధారణ లేదా ఆరోగ్యకరమైన బరువు ఉన్న వారితో పోలిస్తే ఊబకాయం ఉన్న వ్యక్తులు, కింది వాటితో సహా అనేక తీవ్రమైన వ్యాధులు మరియు ఆరోగ్య పరిస్థితులకు ఎక్కువ ప్రమాదం ఉంది.
అధిక రక్తపోటు (రక్తపోటు) ఊబకాయం ఎక్కువగా ఉన్నవారిలో అధిక రక్తపోటు సమస్యను గమనిస్తున్నారు అలాగే శరీరంలో అధిక LDL కొలెస్ట్రాల్, తక్కువ HDL కొలెస్ట్రాల్, లేదా ట్రైగ్లిజరైడ్స్ యొక్క అధిక స్థాయిలు (డైస్లిపిడెమియా) పెరిగిపోయి రక్తనాళాలలో పేర్కొంటాయి ఇవి గుండె జబ్బులకు కూడా కారణమవుతుంటాయి
మన ఊబకాయం జీవనశైలి మార్పులు టైప్ 2 డయాబెటిస్ ఈ వ్యాధికి ముఖ్య కారణం వ్యాయామం లేకుండా శారీరక శ్రమ లేని వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో 30 40 ఏళ్ల మధ్యలోనే కరోనరీ హార్ట్ డిసీజ్, స్ట్రోక్ వంటి గుండె సంబంధిత సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. ఆహారపు అలవాట్లు ముఖ్యంగా ఈ సమస్యలను ప్రేరేపిస్తాయి.
మన పొట్ట పెరిగిపోవడం వలన అది ఊపిరితిత్తుల పై ఒత్తిడి తీసుకు వస్తుంది. దీని వలన పిత్తాశయ వ్యాధి, ఆస్టియో ఆర్థరైటిస్ సమస్యలు అలాగే ఎక్కువసార్లు నిద్ర మేల్కొనడం స్లీప్ అప్నియా వంటి వ్యాధుల బారిన పడుతుంటారు. ఇది స్ట్రోక్ కి కారణం అవుతుంది. అనేక రకాల క్యాన్సర్ బాహ్య చిహ్నలు, తక్కువ జీవన నాణ్యత
క్లినికల్ డిప్రెషన్, ఆందోళన మరియు ఇతర మానసిక రుగ్మతలు వంటి మానసిక అనారోగ్యాలు అధిక బరువు ఉన్న వారిలో మనం గమనించవచ్చు.
శరీరంలో నొప్పి మరియు శారీరక పనితీరులో ఇబ్బంది
అధిక బరువు మరియు ఊబకాయంతో సంబంధం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అందుకే మంచి జీవనశైలి అలవాట్లను అలవర్చుకొని అధిక బరువు సమస్యను తగ్గించుకోవాలి. లేదంటే ఒక ఒక స్థాయి దాటిన బాడీ మాస్ ఇండెక్స్ లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీ వంటివి అవసరం పడతాయి. వీలైనంత సహజంగా బరువు తగ్గించుకోవడం చాలా అవసరం. ఇది పోషకాలతో నిండిన ఆహారం, సమయానికి తీసుకునే ఆహారపుటలవాట్లు, వారంలో కనీసం ఐదు రోజుల పాటు వ్యాయామం వలన సాధ్యమవుతుంది.