సీతాఫలం రుచిని ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. పోషకాలు అధికంగా ఉండి వర్షాకాలంలో దొరికే ఈ పండు చాలా రుచిగా ఉంటుంది. ఇది తిన్న వెంటనే శక్తి వస్తుంది. దీనిలో విటమిన్ సి తోపాటు యాంటీఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా లభిస్తాయి. దీనిలో ఐరన్, విటమిన్ సి, ఫాస్పరస్ మెగ్నీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి బాగా మేలు చేస్తాయి. దీనిలో విటమిన్లు ఖనిజాలు తో పాటుగా పీచు పదార్థాలు కూడా అధికంగా ఉంటాయి. సీతాఫలం రసం కంటే నేరుగా పళ్లను తినడం వలన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది.
సీతాఫలం గుజ్జు తినడం వల్ల నోట్లో జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి. దానిద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. సీజన్లో వచ్చే ఏ ఫలమైన క్యాలరీలతో పాటుగా మాంసకృత్తులు కూడా అందుతాయి. సీతాఫలం ఆకులు, గుజ్జు, గింజలు ప్రతి ఒక్కటి అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. కొన్ని రకాల దీర్ఘకాలిక రోగాలు నశింపజేసే శక్తి సీతాఫలానికి ఉంది. సీతాఫలం ఒక సంజీవని లాగా పనిచేస్తుంది. ఇది ఏ రోగాలను తగ్గించడంలో ఉపయోగపడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కణాల క్షీణత కు కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను విటమిన్ సి సమర్థవంతంగా ఎదుర్కొంటుంది.
సంవత్సరం కాలం ఎన్నో రోగాల నుండి విముక్తి పొందవచ్చు. విటమిన్ సి కంటి చూపు, జీర్ణవ్యవస్థ క్రమబద్దీకరించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ఆరోగ్య నిపుణులు ఈ పండును తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు. జుట్టు మరియు చర్మ సంరక్షణకు సీతాఫలంలో ఉండే విటమిన్ A చాలా బాగా ఉపయోగపడుతుంది. సీతాఫలంలో పొటాషియం, మేగ్నీషియం అధికంగా ఉండటం వలన గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. సీతాఫలం శీతాకాలంలో ఉండే బద్దకాన్ని పోగొట్టడంలో సహాయపడుతుంది.
దీనిలో ఉండే కాపర్ గుణాలు మలబద్దకాన్ని తగ్గిస్తాయి. బక్కపలచగా ఉండి బరువు పెరగాలనుకొనే వారు సీతాఫలం పొడవునా సీతాఫలాలు తినడం వల్ల బరువు పెరుగుతారు. సీతాఫలం గింజలు పొడి చేసుకుని తలలో పేలు పోగొట్టుకోవడానికి పురుగుల మందులు గాని ఉపయోగించుకోవచ్చు. సీతాఫలం ఆకుల రసాన్ని గాయాలకు పట్టించడం వల్ల గాయాలు తగ్గుతాయి. గర్భవతిగా ఉన్నప్పుడు సీతాఫలం తినడం వలన కడుపులో ఉన్న బిడ్డకు నాడీవ్యవస్థ, బ్రెయిన్ డెవలప్మెంట్ బాగా జరుగుతుంది.
సీతాఫలం లో విటమిన్ బి6 ఉండడం వలన ఆస్తమా వంటి అటాక్స్ నుంచి రక్షిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. దంతాలు నొప్పి, దంతక్షయాన్ని తగ్గించడంలో సీతాఫలం చాలా బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో నీటిని తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల మోకాళ్ళ నొప్పి, జాయింట్స్ నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. సీతాఫలం సన్నగా ఉన్నవారు బరువు పెరగడానికి ఉపయోగపడుతుంది.
అలాగే అధిక బరువు సీతాఫలం తినడం వల్ల పెరుగుతారు. సీతాఫలం తినడం వలన దానిలో అధిక మోతాదులో ఉండే ఐరన్ ప్రేగు సంబంధిత సమస్యలు, కడుపు నొప్పి , అజీర్తి వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీనిలో పొటాషియం అధికంగా ఉండటం వలన అతిసారం, కంటి సంబంధిత సమస్యలు వస్తాయి.
Please write in english, so that everybody can be benifited, thankyou