ముఖం పై టాన్ ను, వైట్ హెడ్స్ను రిమూవ్ చేయడానికి బయట మార్కెట్లో దొరికే పీల్ ఆఫ్ మాస్క్లు చాలా ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇంట్లోనే ఇలా సహజ పదార్థాలతో ఫీల్ ఆఫ్ మాస్క్ తయారు చేసుకోవచ్చు అని తెలుసా. ఇవి స్కిన్ పై ఉన్న మురికి శుభ్రం చేసి, మొటిమలు, వైట్ హెడ్స్ లాంటివి నిర్మూలిస్తాయి.
దాని కోసం తీసుకోవాల్సిన పదార్థాలు ఒక క్యారెట్, ఒక బంగాళదుంప. ఇవి చర్మంపై ఉన్న మురికిని తొలగించడంలో చర్మాన్ని కాంతివంతంగా చేయడంలో సహాయపడతాయి. క్యారెట్, బంగాళదుంపను శుభ్రంగా కడిగి వాటిపై ఉన్న చెక్కు తీసేసి మెత్తని పేస్ట్ లా చేయొచ్చు లేదా తురుముకొని వాటినుండి ఈ జ్యూస్ను వడగట్టి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జిలాటిన్ పౌడర్ కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి చిన్న మంటపై కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండడం వలన మిశ్రమం దగ్గర పడుతుంది.గడ్డలు కట్టకుండా, అడుగంటకుండా ఇది కొంచెం దగ్గరగా అయిన తరువాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి.
తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని కనుబొమ్మలకు, కనురెప్పలకు అంటుకోకుండా వేయాలి. లేకపోతే మాస్క్ తీసేటప్పుడు వెంట్రుకలను పీకేస్తుంది. నుదుటిపై చిన్న చిన్న వెంట్రుకలు మొదలయ్యే చోట వేయకుండా కొంచెం కింద నుంచి ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఒకసారి అప్లై చేసిన మిశ్రమాన్ని ఆరిన తరువాత రెండవ సారి అప్లై చేయాలి. ఇ
ది పూర్తిగా ఆరిపోయిన తరువాత ఈ ప్యాక్ ను కింది నుంచి పైకి తీయాలి. ఇలా తీయడం వలన ముఖంపై పేరుకున్న బ్లాక్హెడ్స్, వైట్ హెడ్స్, చిన్ని చిన్ని ఫేషియల్ హెయిర్ వచ్చేస్తుంది. అలాగే చర్మం బిగుతుగా ముడతలు లేకుండా తయారవుతుంది. ఈ మిశ్రమాన్ని అప్లై చేసేటప్పుడు కనుబొమ్మలకు, కనురెప్పలకు కొబ్బరినూనె రాయడం వలన ఇది వెంట్రుకలకు అంటుకోదు.
తరువాత ఈ ప్యాక్ చేసిన వెంటనే ముఖానికి అలోవెరా జెల్ గానీ ఏదైనా మాయిశ్చరైజర్ కానీ రాయడం వలన మొఖం కోల్పోయిన తేమను తిరిగి అందించి చర్మం పొడిబారకుండా కాపాడుకోవచ్చు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్లు ఈ పీల్ ఆఫ్ మాస్క్ ఉపయోగించకూడదు. దీనివలన చర్మంపై చిన్నపాటి మంట ఉంటుంది. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారికి దద్దుర్లు వచ్చే అవకాశం కూడా ఉంది.
What is the meaning of gelatin