సన్ టాన్ వల్ల ముఖము ఒక కలర్ లో కాళ్లు, చేతులు,cమెడ ఒక రంగులో ఉంటాయి. మీ ముఖం ఉండే రంగులోకి కాళ్లు, చేతులు రావాలంటే రకరకాల క్రీములను, సోప్ లను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. వంటింట్లో ఉండే వాటితోనే ఇలా ట్రై చేసినట్లయితే కాళ్లు, చేతులు, మెడ వంటి భాగాలు తెల్లగా మెరిసిపోతాయి. దీనికోసం ఒక బీట్రూట్ తీసుకొని తొక్క చెక్కి గ్రేటర్ సహాయంతో మెత్తగా తురుముకోవాలి లేదా ముక్కలు కట్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకున్న సరే పర్వాలేదు.
ఈ బీట్రూట్ తురుము నుండి జ్యూస్ ను వడకట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక చెంచా బియ్యప్పిండి, అర చెంచా బేకింగ్ సోడా, ఒక చెంచా షాంపు, అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా సరిపడినంత బీట్రూట్ జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి. షాంపు బదులుగా బాడీ వాష్ లేదా సోప్ వాటర్ ని కూడా ఉపయోగించవచ్చు. దీనిలో అర చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని కాళ్లు, చేతులు, మోచేతులు వంటి నల్లగా మారిన భాగాలలో అప్లై చేసి ఐదు నిమిషాల పాటు ఆరనివ్వాలి.
తర్వాత నిమ్మ చెక్కతో స్క్రబ్ చేస్తూ నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసేసరికి మీ చర్మం పై ఉండే టాన్ మొత్తం పోతుంది. తర్వాత ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకొని రెండు చెంచాల శెనగపిండి, పావు చెంచా కస్తూరి పసుపు, కొంచెం బీట్రూట్ జ్యూస్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో అర చెక్క నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వద్దు అనుకున్న వాళ్లు క్యారెట్ జ్యూస్, పొటాటో జ్యూస్ లేదా టమాటో జ్యూస్ వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని నల్లగా ఉన్న భాగాల్లో అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి.
తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే చర్మంపై ఉండే టాన్, జిడ్డు, మురికి మొత్తం మాయమైపోయి స్కిన్ తెల్లగా, కాంతివంతంగా మెరిసిపోతుంది. ఇది నాచురల్ చిట్కా కాబట్టి ఈ చిట్కా ఉపయోగించడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సన్ టాన్ వలన నల్లగా మారిపోయిన కాళ్లు, చేతులు, మోచేతులు వంటి భాగాలలో ఈ ప్యాక్ అప్లై చేస్తే 100% రిజల్ట్ ఉంటుంది.