Sun tan removal cream for face and hands

పాలుతో పాటు ఈనో కూడా కలిపి రాస్తే నలుపు జిడ్డు మురికి సన్ టాన్ మాయం

అందరూ ముఖం పై తీసుకున్న కేర్ కాళ్ళు, చేతుల మీద తీసుకోరు. ముఖాన్ని రోజుకు నాలుగు నుంచి ఐదు సార్లు అయినా శుభ్రంగా కడుక్కుంటు  ఉంటారు  కానీ కాళ్లు, చేతులు ఒక్కసారి కూడా కడగడం కష్టం. అందువల్ల ముఖము ఒక  రంగులో కాళ్లు చేతులు ఒక రంగులోకి మారిపోతాయి. జిడ్డు, మురికి, సన్ టాన్ వలన కాళ్ళు, చేతులు  నల్లగా అయిపోతాయి. సన్ టాన్  తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు రాసినప్పటికీ ప్రయోజనం ఉండదు. పాలలో ఈనో తో పాటు  ఇది కలిపి రాస్తే  జిడ్డు మురికి మొత్తం పోతుంది. 

దీని కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అరకప్పు పాలు వేసుకోవాలి. పచ్చి పాలను మాత్రమే వేసుకోవాలి. దీనిలో ఒక చెంచా బియ్యప్పిండి వేసుకోవాలి బియ్యప్పిండి స్కిన్  వైట్నింగ, డెడ్  స్కిన్ సెల్స్ ను పోగొట్టడానికి ఉపయోగపడుతుంది. దీనిలో అర చెక్క నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మకాయ విటమిన్ సి కలిగి ఉండటం వలన చర్మంపై ఉండే  దుమ్ము ధూళి బ్యాక్టీరియా వైరస్ వంటి వాటిని పోగొట్టడానికి సహాయపడుతుంది. దీనిలో ఒక ఈనో ప్యాకెట్ ను వేయాలి.  

ఈనో  కెమికల్స్ కదా అది చర్మంపై ఉపయోగించవచ్చా అని  అందరూ అడుగుతూ ఉంటారు. డాక్టర్ల సలహా లేకుండా గ్యాస్ ట్రబుల్ తగ్గించుకోవడానికి లోపలికి వేసుకుంటే ఏం జరగదు. కాబట్టి చర్మం పై ఉపయోగించడం వల్ల ఎటువంటి నష్టం కలగదు. ఈ మిశ్రమాన్ని బాగా కలిపుకోవాలి. నురగ మొత్తం పోయేంతవరకు కలుపుకోవాలి. తర్వాత నల్లగా మారిన భాగంలో కాళ్ళు, చేతులు, మెడ, చంకలు వంటి భాగంలో అప్లై చేసి 5 నిముషాల పాటు నిమ్మచెక్కతో మస్సాజ్ చేసుకోవాలి.

తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేసినట్లయితే జిడ్డు, మురికి, సన్ టాన్ మొత్తం పోయి చర్మం తెల్లగా మారిపోతుంది.ముఖం మీద అప్లై చేసుకోవాలి అనుకునేవారు ప్యాచ్ టెస్ట్ చేసి ఎటువంటి రియాక్షన్ లేకపోతే అప్పుడు ముఖం పై అప్లై చేసుకోవచ్చు. మీకు సమయం ఉన్నపుడు ఈ చిట్కా ట్రై చేసి సన్ టాన్ మొత్తం పోగొట్టుకోండి. ఎటువంటి ఖర్చు లేకుండా ఈజీగా ఇంట్లోనే ఈ చిట్కా తో సన్ టాన్, జిడ్డు, మురికి మొత్తం పోగొట్టుకోవచ్చు.ఎన్నో రకరకాల క్రీమ్స్ ఉపయోగించాము అయినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేదు అనుకున్నవారు ఒకసారి ఈ చిట్కా ట్రై చేయండి.  వెంటనే మంచి రిజల్ట్ ఉంటుంది.

Leave a Comment

error: Content is protected !!