ఆకుకూరలు కూరగాయలతో పోల్చితే దుంపకూరలలో విలువలు ఖనిజాలు తక్కువ. పోషకాలలో ఆకుకూరలు మొదటిస్థానం, కూరగాయలు రెండవ స్థానం, దుంపలు తృతీయ స్థానం. దుంపల్లో ఖనిజాలు తక్కువ ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు ఎక్కువ. పోషకాలు, పీచుపదార్థాలు తక్కువ ఉంటాయి. దుంపలు వలన అధికబరువు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్స్, ఫ్యాటీలివర్ సమస్య, డయాబెటిస్, ఇలాంటివన్నీ పెరిగిపోతున్నాయి కాబట్టి శారీరక శ్రమ ఉండనివారు తినకపోవడం మంచిది. మనం వాడే బంగాళదుంప, చేమదుంపలో వందగ్రాముల శక్తి ఉంటే చిలకడదుంపలో మాత్రం నూటఇరవై కేలరీల శక్తి ఉంటుంది. ఇప్పుడు అన్ని సీజన్లో అందుబాటులో ఉంటున్నాయి. మనకి హాని జరగకుండా చిలకడదుంపలు వారానికి ఒకసారైనా ఇలా తినొచ్చు.మరింత సమాచారం కోసం క్రింద లింక్ చూడండి
ఒవెన్లో, నిప్పుల్లో ఉడికించి తినొచ్చు. పైన తొక్క మాడినట్టు కాలాలి. నీటిశాతం ఆవిరవడం వలన లోపలి గుజ్జు తియ్యగా తయారవుతుంది. నీటిలో వేసి ఉడికించినవి కొంచెం చప్పగా అనిపిస్తాయి. కాల్చినవి పైన తొక్కతీసేసి తినాలి. వాటిని ఒక నాలుగయిదు సాయంత్రం లేదా మధ్యాహ్నం పూట భోజనంలా తినేయాలి. నెమ్మదిగా తినాలి. లేకపోతే గొంతు పట్టేస్తుంది. ఒక నాలుగొందల గ్రాముల దుంపలు తిని ఇంకా ఆకలి వేస్తే బొప్పాయి లేదా ఖర్బూజ తినొచ్చు. దీనిని స్నాక్ లా కాకుండా మధ్యాహ్న భోజనం లేదా రాత్రి భోజనంగా తినేయండి. మగవారు ఐయినా సరే ఒవెన్ లో ఈజీగా కాల్చి తినొచ్చు. బరువు తగ్గాలనుకునేవారు, డయాబెటిస్ ఉన్నవారు కూడా ఇలా తినొచ్చు వారానికి ఒకసారి. పండ్లు తక్కువగా ఉన్నప్పుడు కూడా చిలకడదుంపలు తినేసి కొంచెం పండ్లు తినొచ్చు.
చిలకడదుంపలు పులుసులు లేదా కూరలు, సాంబార్లో ఉపయోగిస్తారు. చిలకడదుంపల్లో చర్మకణాలను పట్టి ఉంచే కొలాజిన్ ఉత్పత్తిని పెంచే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అలాగే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా యవ్వనంగా ఉంచడంలో సహాయపడి విటమిన్ సి వాడే వారిలో వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తుంది. బీటాకెరోటిన్, విటమిన్ ఇ, సి, బి6పొటాషియం, ఐరన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. గ్లైకమిక్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. చలికాలంలో తినడంవలన ఆ కాలంలో వచ్చే సీజనల్ ప్లూ, జ్వరాలను అదుపు చేస్తుంది. మధుమేహం ఉన్నవారికి కూడా ఈ దుంపలు ఎంతోమేలు చేస్తాయి. షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుతాయి. పొటాషియం అధికంగా ఉండి గుండెకు మేలు చేస్తుంది. హార్ట్ బీట్ సరిచేసేందుకు దోహదపడుతుంది. వీటిని తినడంవలన కండరాలు, నరాల ఆరోగ్యానికి మంచిది. దీనిలో ఉండే మెగ్నీషియం గుండె ధమనుల ఆరోగ్యానికి మంచిది. గాయాలైనప్పుడు త్వరగా తగ్గేందుకు సహాయపడతాయి. యాంటీ కాన్సర్ లక్షణాలు కాన్సర్ తో పోరాడతాయి.