మొహంపై మొటిమలు, మచ్చలు, నల్లటి వలయాలు ఎక్కువగా ఉంటాయి.వీటిని తగ్గించుకోవడానికి రకరకాల క్రీమ్స్ ఉపయోగిస్తారు. కెమికల్స్ ఉన్న క్రీమ్స్ ఉపయోగించడం వలన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముఖం పై ఉండే మచ్చలు, వలయాలు, బొంగు మచ్చలు ఈజీగా ఇంట్లో ఉండే వాటితోనే పోగొట్టుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక బంగాళాదుంప గుడ్రంగా కట్ చేసుకుని 3 ముక్కలు తీసుకోవాలి.
ఒక ముక్క మీద ఒక చెంచా ముల్తానీ మట్టి వేసుకోవాలి. ముల్తానీ మట్టి ముఖం కాంతివంతంగా, మచ్చలు లేకుండా మృదువుగా చేయడంలో సహాయపడుతుంది. మరొక బంగాళదుంప మీద ఒక చెంచా తేనెను వేసుకోవాలి. తేనె చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది. మరొక బంగాళదుంప మీద ఒక చెంచా కస్తూరి పసుపు వేసుకోవాలి. కస్తూరి పసుపు ముఖంపై ఉండే మచ్చలు, వలయాలు, బొంగు మచ్చలు, మొటిమలు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
దీనికోసం మామూలు పసుపు ఉపయోగించకూడదు. కస్తూరి పసుపు మాత్రమే ఉపయోగించాలి. ఒకసారి ముఖం నీటితో శుభ్రంగా కడిగి మొదటగా తేనే వేసిన బంగాళదుంప ముక్కతో ముఖం మొత్తం ఐదు నిమిషాల పాటు క్రాఫ్ట్ చేసుకోవాలి. తర్వాత మరొక ఐదు నిమిషాల పాటు చేతితో మసాజ్ చేసుకోవాలి. సర్కులర్ మోషన్ లో మాత్రమే చేసుకోవాలి. తర్వాత ముల్తానీ మట్టి వేసిన బంగాళదుంప ముక్కలు ముఖం మొత్తం స్క్రబ్ చేయాలి.
స్క్రబ్ చేసిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు అలా ఉంచేసి ఒక ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. మసాజ్ సర్కులర్ మోషన్ లో మాత్రమే చేయాలి. తర్వాత కస్తూరి పసుపు వేసిన బంగాళదుంప ముక్కతో కూడా ముఖాన్ని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసి ఖైదీ నిమిషాలపాటు చేతితో మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో ముఖాన్ని కడిగేసుకోవాలి. సబ్బు యూస్ చేయకూడదు. ఇలా వారానికి రెండుసార్లు చేసినట్లైతే ముఖంపై ఉండే నల్లటి మచ్చలు, వలయాలు, బొంగు మచ్చలు, మొటిమల మచ్చలు తగ్గి ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
ఈ ఇది ట్రై చేసి మీరు కూడా ముఖం పైన మచ్చలు, నల్లటి వలయాలు, బొంగు మచ్చలు, మొటిమలు, మొటిమల వలన మచ్చలను తగ్గించుకోవచ్చు.బంగాళాదుంప చర్మ రంద్రాలలో పేరుకుపోయిన మురికిని బయటకి లాగి క్లీన్ చేస్తుంది. ఈ చిట్కాలు ఇంట్లో ఉండే వాటితో చేస్తున్నాము. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 100% రిజల్ట్ ఉంటుంది.