అందరూ జుట్టు రాలడం సమస్య తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నారు. వీటిలో కెమికల్స్ ఉండటం వలన అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని మూడు చెంచాల మందార పొడిని వేసుకోవాలి. తర్వాత దీనిలో మూడు చెంచాల ఉసిరికాయ పొడి కూడా వేసుకోవాలి.
తర్వాత దీనిలో ఒక నిమ్మకాయ రసం పిండుకోవాలి. నిమ్మకాయ తలలో చుండ్రు, దురద,ఇన్ఫెక్షన్ వంటి సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు ఒత్తుగా, స్పీడుగా పెరగడం కోసం నిమ్మకాయ ఉపయోగపడుతుంది. జుట్టు కుదుళ్ల నుండి బలంగా ఎదగడం కోసం నిమ్మకాయ ఉపయోగపడుతుంది. తర్వాత దీనిలో ఒక గుడ్డు వేసుకోవాలి. ఎగ్ వైట్ మరియు ఎల్లో రెండింటిని వేసి బాగా కలుపుకోవాలి. గుడ్డులో ఉండే ప్రోటీన్స్ జుట్టు కుదుళ్లు బలంగా, ఒత్తుగా, పొడవుగా పెరగడం లో సహాయపడతాయి.
జుట్టు ఆరోగ్యంగా పెరగడం కోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత దీంట్లో బాగా పులిసిన పెరుగుని వేసుకోవాలి. ఇది ప్యాక్ అప్లై చేసుకోవడానికి వీలుగా ఉండే విధంగా వేసి బాగా కలుపుకోవాలి. పెరుగు జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే జుట్టుకు మాయిశ్చర్ అందిస్తుంది. జుట్టుకు అప్లై చేసుకోవడానికి ముందుగా మీకు నచ్చిన ఆయిల్ జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు బాగా అప్లై చేసుకోవాలి. తలకు హెయిర్ ఆయిల్ ను సరిగ్గా అప్లై చేయకపోయినా సరే జుట్టు రాలడం సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది.
జుట్టు రాలుతుంది అంటే అసలు కారణం ఏంటో తెలుసుకోవాలి. అప్లై చేసిన ఒక గంట తర్వాత ఈ ప్యాక్ ను అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఒక అరగంట పాటు ఉండనివ్వాలి. తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండు సార్లు అప్లై చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఈ ప్యాక్ అప్లై చేయడం వల్ల చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
జుట్టు పెరగడం లేదు అనుకునే వారు ఒకసారి ఈ ప్యాక్ ను ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మందార పొడి లేని వారు మందార పువ్వులను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్యాక్ ను వారంలో రెండు సార్లు అప్లై చేసుకోవాలి.