Top 10 health tips in telugu

10 ఆరోగ్య సూత్రాలు తెలుగులో (300 పుస్తకాలు నుండి)

ఆరోగ్యంగా ఉండడానికి మన జీవితంలో చేయగలిగిన పది సూత్రాలను గురించి తెలుసుకుందాం. ఎటువంటి ఖర్చులేకుండా  మన జీవితంలో చిన్నచిన్న మార్పులతో ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితం మన సొంతమవుతుంటే ఎందుకు వద్దంటాం చెప్పండి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి

విటమిన్ డి పొందటం :- చాలామందికి తెలిసినట్టే సూర్యుని కింద నిలబడడం ద్వారా విటమిన్ డి పొందవచ్చు. ఉదయం 8-10 మధ్య సూర్యకిరణాలలో ఉండే యూవీఏ, యూవీబీ ద్వారా విటమిన్ డీ తయారవుతుంది. యూవీబీ ఎక్కువ ఉండే 11-1 గంటల మధ్య ఎండలో ఉండడం వలన విటమిన్ డి ఎక్కువ పొందుతాం. 

ఇంటర్మిటెన్ ఫాస్టింగ్ :- ఇప్పటి పనివేళలు, సమయపాలన కారణంగా చాలా మంది అర్థరాత్రి వరకు భోజనం చేయకుండా ఉంటున్నారు. రాత్రులు ఏడుగంటలలోపు భోజనం ముగించి మళ్ళీ ఉదయం వరకూ ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉండడాన్ని ఇంటర్మిటెన్ ఫాస్టింగ్ అంటారు. దీనివలన శరీరానికి విశ్రాంతి లభించి బరువు తగ్గాలి అనుకునేవారికి ఉపయుక్తంగా ఉంటుంది.

నడక :- రోజుకి పదివేలకిమించి అడుగులు నడవడం వలన  బరువు తగ్గడంతో పాటు శరీరంలోని హర్మోన్లు ఉత్తేజితం అయి మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

వ్యాయామం :- రోజుకి ఒక గంట వ్యాయామం చేసి ఇక రోజంతా పడుకుని ఉండడం వలన ఎటువంటి లాభం ఉండదు. రోజంతా కూర్చుని ఉండకుండా అప్పుడప్పుడయినా లేచి నడుస్తూ ఉండడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది.

 నీళ్ళు తాగడం :- రోజుకి ఎనిమిది గ్లాసుల నీళ్ళు తాగడం వలన శరీరానికి ఎంత మేలు జరుగుతుందో అవసరానికి మించి తాగడం వలన  శరీరానికి అంతే నష్టం ఏర్పడుతుంది. అందుకే దాహం వేసినప్పుడు మాత్రమే నీళ్ళు తాగండి.బలవంతంగా తాగకండి.

ప్లాస్టిక్ వాడడం ఆపండి :- మనం రోజూ వాడే డబ్బాలు, నీళ్ళ బాటిల్స్ వలన ప్లాస్టిక్ కరిగి ఆహారం, నీళ్ళలో చేరి శరీరంలో ప్రవేశిస్తే అది హార్మోన్లకు నష్టం కలిగిస్తుంది. దీనివలన శరీరంలో అనేకరకాల మార్పులు వచ్చి అనారోగ్యం పాలవుతాం.ప్లాస్టిక్ ను వదిలి వీలైతే గాజు, స్టీల్ వస్తువులకు మారండి.

వంట నూనెల ఉపయోగం తగ్గించండి :- నూనెల్లో ఉండే ఒమెగా 3 – ఒమెగా 6 శాతం సమానంగా ఉండాలి. కానీ ఇప్పటిరోజుల్లో వాటిశాతాల్లో అనూహ్యమయిన మార్పులు ఏర్పడుతున్నాయి. వీలయినంత నెయ్యీ, వెన్నలకు మారడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవి కూడా మితంగానే వాడాలి.

ఫోన్లు, లాప్టాప్ వినియోగం తగ్గించండి :- ఫోన్, టీవీ, కంప్యూటర్ వలన కంటి సమస్యలు ఏర్పడతాయని మనందరికీ తెలిసిందే. అంతేకాకుండా వాటినుంచి వెలువడే బ్లూ లైట్ వలన మెదడు పగటికి, రాత్రికి తేడా తెలియక నిద్రకు పురికొల్పే హార్మోన్లను విడుదల చేయడంలో జాప్యంచేస్తుంది. అందుకే పడుకోవడానికి చాలా సమయానికి ముందు నుండే వాటి వాడకం తగ్గించాలి.

రేడియేషన్ కి దూరంగా ఉండండి :- ఫోన్లు నుండి వెలువడే Emf రేడియేషన్ రక్తానికి, మెదడుకు మధ్య ఉండే పొరను కరిగించి మెదడు పనితీరులో ఆటంకాలు కలిగిస్తుంది. చెవి సమస్యలకు కూడా కారణమవుతుంది. అందుకే ఫోన్లు వాడేటపుడు చెవి దగ్గరగాపెట్టుకుని మాట్లాడకూడదు. అంతేకాకుండా దానినుండి వెలువడే రేడియేషన్ వలన అనేక గుండె,సంతాన సమస్యలు వస్తున్నాయి. అందుకే ఫోన్ వినియోగం అదుపులో పెట్టుకోవాలి.

మంచి నిద్ర :- మెదడులో ఉండే కణాలు మనం పడుకున్నప్పుడు కుచించుకొని వాటిమధ్య ఉండే మలినాలను  కొన్ని ద్రవాలు శుభ్రం చేస్తాయి. శరీరం కూడా నిద్రలో తనని తాను రిపేర్ చేసుకుంటూ శరీరంలోని టాక్సిన్లను తొలగించుకుంటుంది. నిద్రలో దానికి కావలసిన అనేక హర్మోన్లు విడుదలవుతుంటాయి. ఎప్పుడైతే నిద్ర సరిగ్గా లేదో మనం వాటిని కోల్పోయినట్టే.

మంచినిద్ర మానసిక, శారీరక ఆరోగ్యంలో కీలకపాత్ర పోషిస్తుంది.

Leave a Comment

error: Content is protected !!