శరీరంలో యాసిడ్స్ తక్కువగా ఉన్నా లేదా అధికారులు కంగా విడుదలయినా జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడతాయి. వీటిని గ్యాస్ట్రిక్ అల్సర్లుగా పిలుస్తారు. ఆహారం తిన్న తర్వాత పేగుల్లో ఒత్తిడి బాగా పెరిగిపేగుల గోడలు సాగినట్టయి అల్సర్లు ప్రాంతంలో నొప్పి అనిపించవచ్చు. దీనిని ప్రెజర్ పెయిన్ అని కూడా అంటారు. జీర్ణవ్యవస్థలో ఉండే ఘాడమైన యాసిడ్లు ఏర్పడినప్పుడు మంట రావచ్చు.
ఈ సమస్య ఉన్నవారికి భోజనం తర్వాత మంటగా ఉండడం , అసౌకర్యం గా అనిపించడం ఉంటుంది. ఛాతిలో ళమంట, నొప్పి, ఎసిడిటీ, అజీర్ణం, వికారం కడుపులో అల్సర్లు ఉన్నాయనడానికి నిదర్శనం ఈ సూచనలు. వీటికి కారణాలేంటంటే ఎనభైశాతం మందిలో గ్యాస్ట్రిక్ అల్సర్లు రావడానికి హెలికో పైర్లోరి అనే బాక్టీరియా కారణం. దీనికితోడు అస్తవ్యస్తమైన జీవనశైలి, ఆహార నియమాలు పాటించకపోవడం, కారం మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం.
ఒత్తిడి, ఆందోళన, పెయిన్ కిల్లర్స్ వంటి మందులను విచక్షణారహితంగా వాడడం. మద్యపానం, ధూమపానం పొగాకు నమలడం, కాఫీలు ఎక్కువగా తాగడం, క్యాన్సర్ మొదలైన అనేకకారణాల వలన జీర్ణాశయంలో అల్సర్లు ఏర్పడతాయి. అల్సర్లు రావడానికి ముఖ్యకారణం అస్తవ్యస్తంగా ఉన్న జీవన శైలి. ముఖ్యంగా అరవై ఏళ్ళు పైబడిన మహిళలే ఈ సమస్య తో బాధపడుతున్నారు. పూజలు వ్రతాల పేరిట ఉపవాసాలు చేయడంఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే కారణం.
వీటి లక్షణాలు ఏంటంటే కడుపులో మంట,ఉబ్బరం, పుల్లటి త్రేన్పులు, మలబద్దకం, ఛాతిలో నొప్పి, ఆకలి తగ్గడం, రక్తపు వాంతులు, రక్తవిరోచనాలు, కొంచెం తినగానే పొట్ట నిండుగా ఉండడం, ఆకలి తగ్గిపోవడం, నోట్లో నీళ్ళు ఊరడం జరుగుతుంది. ఈ లక్షణాలు మీలో ఉంటే తప్పకుండా డాక్టర్ ను సంప్రదించాలి. సమస్య ను దీర్ఘకాలం పాటు నిర్లక్ష్యం చేస్తే అది కాన్సర్ గా మారే అవకాశం ఉంది.
ఎక్స్రే, ఎండోస్కోపి, రక్తపరీక్షలు, బయోస్కోపి, లేదా ముక్కు పరీక్ష, ద్వారా వ్యాధిని నిర్థారిస్తారు. అల్సర్లు రాకుండా ఉండాలంటే ప్రతిపూటా సమయానికి ఆహారం తీసుకోవాలి. మంచినీళ్ళు బాగా తాగాలి. కలుషిత నీరు తాగరాదు. మందులు పరిమితంగా డాక్టర్ సలహాతో వాడాలి. ఒత్తిడి, ఆందోళనకు దూరంగా ఉండాలి. ధూమ, మద్యపానాలు మానేయాలి.