unknown benefits of curry leaves

రోజూ వాడే కరివేపాకులో షాకింగ్ నిజాలు

వంట ఘుమఘుమలాడాలంటే కరివేపాకు అందులో తప్పనిసరి ఉండాలి. అది లేకుండా వంట ఎంత అద్భుతంగా వండినా ఏదో తెలియని వెలితి. అందుకే వంటల్లో కరివేపాకు కు అంత గొప్ప స్థానం ఉంది. వండిన తరువాత  తింటున్నపుడు ఏరేసి పక్కన పడేసినా అప్పటిదాకా అది వంటకు ఇచ్చిన సువాసన అమోఘం. అంతటి కరివేపాకు కేవలం వంటలకే కాదు ఆరోగ్యాన్ని కూడా అద్భుతంగా సంరక్షిస్తుందని మీకు తెలుసా?? కరివేపాకు ఎన్ని విధాలుగా వాడచ్చు, వాటి ప్రయోజనాలు ఏమిటి?? కరివేపాకులో అద్భుతం ఒకసారి చూడండి.

కాల్షియం, పాస్పరస్, ఫైబర్, విటమిన్-ఎ, విటమిన్-సి కరివేపాకులో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కేవలం సువాసనను మాత్రమే కాకుండా అందులో ఇమిడి ఉన్న పోషకాలు మన శరీరంలోకి వెళ్లి శరీరాన్ని ఆరోగ్యవంతం చేస్తాయి. 

కరివేపాకుతో ఆరోగ్య ప్రయోజలెన్నో 

అధికచెమట 

అధిక చెమట ఉన్నవారికి కరివేపాకు గొప్పగా పని చేస్తుంది. ప్రతిరోజు ఆహారంలో తప్పనిసరిగా కరివేపాకును తీసుకోవడం వల్ల అధికంగా పట్టె  చెమట నుండి ఉపశమనం పొందవచ్చు

అధిక వేడికి

ఒళ్లేమో నార్మల్ గా ఉంటుంది. శరీరం లోపల మాత్రం అగ్నిగోళం లా వేడి పుడుతూ మానసికంగా అస్తవ్యస్తంగా మార్చేస్తుంది. దీనికి కారణం అధిక వేడి. అధిక వేడి తగ్గించడానికి కరివేపాకు చక్కని ఔషధం. కరివేపాకును మెత్తని ముద్దలా నూరి అరస్పూన్ మోతాదుగా తీసుకోవడం వల్ల అధిక వేడి తగ్గిపోతుంది.

వాతావరణ కాలుష్యం

కాలుష్యానికి కరివేపాకుకు ఏంటి లింకు అనుకోకండి. కరివేపాకు మొక్కలను కాలుష్యం అధికంగా ఉన్న ప్రదేశాల్లో నాటడం వల్ల కాలుష్యాన్ని క్రమబద్దీకరించి దానివల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. కరివేపాకు చెట్టు నుండి విడుదల అయ్యే గాలి కాలుష్యానికి చెక్ పెడుతుంది.

అనిమియా

మహిళల్లో ఈ జబ్బు పోటీ పడుతూ ఉంటుంది. రక్తహీనత వల్ల మహిళలు నీరసంగా శరీరమంతా పాలిపోయినట్టు అయిపోయి నిర్జీవమైన చర్మంతో కాంతి లేకుండా తయారవుతారు. ఐరన్ అధికంగా ఉన్న కరివేపాకు రక్తహీనతను నిర్మూలిస్తుంది. ప్రతిరోజు కరివేపాకును ఏ రూపంలో తీసుకున్నా అది అనిమియాను అరికడుతుంది. అందుకే కూరల్లో కరివేపాకే కదా అని తీసేయకండి నెమ్మదిగా నమిలి మింగేయండి.

విరేచనాలు

మనిషి శరీరాన్ని కృశించిపోయేలా చేసే జబ్బు విరేచనాలు. వీటిని అరికట్టడానికి కరివేపాకు సిద్ధంగా ఉన్నాను అంటుంది. కరివేపాకును నీడవాటున ఆరబెట్టి దంచి పొడి చేసుకోవాలి. ఈ పొడిని అరస్పూన్, తేనె స్పూన్ రెండు కలిపి బాగా మిక్స్ చేసి తీసుకోవాలి దీనివల్ల విరేచనాలు తగ్గిపోతాయి.

ఉదర సమస్యలు

కడుపులో మంట, జీర్ణాశయం సమస్యలు, అల్సర్ పుండ్లు వంటి వాటికి కరివేపాకు పొడి లేదా రసం ఒక స్పూన్, ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తీసుకోవాలి. సమస్య తగ్గిపోతుంది.

శ్వాశ సంబంధ వ్యాధులు

శ్వాశ సంబంధ వ్యాధులకు కరివేపాకును గోంగూర పచ్చడిలా నూరుకుని అన్నం తో తినాలి. దీనివల్ల శ్వాశ సంబంధ వ్యాధులు అన్ని నయమవుతాయి.

కళ్ళకింద నల్లని వలయాలు

సాధారణంగా ఇప్పటి అమ్మాయిలతో ఎక్కువ గా కనబడే సమస్య కళ్ళ కింద నల్లని వలయాలు. దాన్ని తగ్గించడానికి కరివేపాకు రసం ఒక స్పూన్ కొద్దిగా పెరుగు రెండు బాగా కలిపి కళ్ళకింద రాస్తుండాలి దీనివల్ల నలుపు మెల్లిగా తగ్గిపోతుంది.

కరివేపాకు నూనె

జుట్టు నల్లగా ఒత్తుగా పెరగడానికి కరివేపాకు నూనె చాలా బాగా పని చేస్తుంది. కప్పుడు కరివేపాకును మెత్తని పేస్ట్ లా రుబ్బుకోవాలి. కప్పుడు కొబ్బరి నూనెను ఆ ముద్దలో కలిపి సన్నని మంట మీద ఉడికించాలి. కరివేపాకు ముద్దలో తేమ ఇగిరిపోయే వరకు ఉడికించి దించి చల్లార్చి ఒక గాజు సీసాలో నిల్వచేసుకోవాలి. ఆకుపచ్చని రంగులో ఆహ్లాదపరుస్తూ, మంచి సువాసనతో తలనూనె సిద్ధం. ఇది జుట్టును నల్లగా వొత్తుగ పెరిగేలా చేస్తుంది. 

చివరగా…….

కరివేపాకు ప్రతి ఇంట్లో వంటింటి ఉపయోగం కోసం పెంచుకునే మొక్క అయినా ఆరోగ్యపరంగా ఎన్నో విధాలుగా ఆదుకుంటుంది కాబట్టి ఒక చిన్న కరివేపాకు మొక్కను నాటేయండి. ఆరోగ్యమంతా మీదే ఇక.

1 thought on “రోజూ వాడే కరివేపాకులో షాకింగ్ నిజాలు”

Leave a Comment

error: Content is protected !!