unknown facts about Punica granatum Leaves

ఆకుల అందరికీ తెలుసు కానీ ఈ ఆకులలో ఉన్న రహస్యం ఎవరికీ తెలియదు

దానిమ్మ గింజలను అందరూ ఇష్టంగా తింటారు. అలాగే దానిమ్మ ఆకులు కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వకాలం నుంచి  దానిమ్మ ఆకులను, దానిమ్మ బెరడును సాంప్రదాయ ఆయుర్వేద వైద్యంలో ఉపయోగిస్తున్నారు. మన పూర్వీకులు కూడా దానిమ్మ ఆకులను ఎన్నో అనారోగ్యాలను నయం చేసుకోవడానికి ఉపయోగించేవారు. చలికాలంలో జలుబు, దగ్గు సమస్య ఎక్కువగా బాధిస్తుంది. అలాంటప్పుడు  స్టవ్ మీద గ్లాసు  నీళ్ళు పెట్టుకుని శుభ్రంగా కడిగిన దానిమ్మ ఆకులను వేసి రెండు నిమిషాల పాటు మరిగించాలి.

ఈ నీటిని ఉదయం, సాయంత్రం తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు తగ్గుతుంది నిద్రలేమి సమస్యతో బాధపడేవారు  30 గ్రాముల దానిమ్మ  ఆకుల పేస్టు,  250 M నీళ్లు lకలిపి  మూడవ వంతు అయ్యేంతవరకు మరిగించాలి. ఈ నీరు తాగడంవలన బాగా నిద్ర పడుతుంది. కిడ్నీ సమస్యలు,   లివర్ సమస్యలు, వాంతులు, అరుగుదల సమస్యలు ఉన్నవారు  దానిమ్మ ఆకులను సేకరించి నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవాలి. ఈ పొడిని  రోజుకు మూడు గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల ఈ సమస్యలు అన్నీ తగ్గుతాయి.

దానిమ్మ ఆకులను సేకరించి  నీటిలో వేసి మరిగించి  ఆ టీ తాగడం వలన అధిక బరువు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.   జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు నొప్పి, కడుపులో  ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే  తగ్గిపోతాయి. ఈ ఆకుల టీ తాగడం వలన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.  సీజనల్గా వచ్చే వ్యాధులను తగ్గిస్తుంది. చెవి నొప్పి, చెవిలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దానిమ్మ ఆకుల రసాన్ని తీసి నువ్వుల నూనె లేదా ఆవ నూనె వేసి మరిగించి చల్లారిన తర్వాత రెండు చెవుల్లో  రెండు చుక్కలు వేయడం వల్ల చెవినొప్పి, ఇన్ఫెక్షన్ తగ్గుతాయి.

నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలు, నోటిలో పుండ్లు వంటి సమస్యలు ఉంటే 25 గ్రాముల దానిమ్మ ఆకులను రసం తీసి, 400 ml నీటిలో వేసి 200ml అయ్యేంత వరకు మరిగించాలి. ఆ నీటితో రోజుకు రెండు మూడు సార్లు నోటిని పుక్కిలించడం వలన నోటి సమస్యలు తగ్గుతాయి. గుప్పెడు దానిమ్మ ఆకులను తీసి దంచి పేస్ట్గా చేసి ముఖానికి అప్లై చేసినట్లయితే మొటిమలు తగ్గుతాయి.

రోజుకు రెండు స్పూన్ల  దానిమ్మ ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ తగ్గుతుంది. గజ్జి, తామర వంటి చర్మ సమస్యలు ఉన్న ప్లేస్ లో  దానిమ్మ ఆకుల పేస్టు అప్లై చేయడం వలన చర్మ సమస్యలు తగ్గుతాయి. దగ్గు ఆగకుండా వస్తున్నట్లయితే ఎండ బెట్టిన  దానిమ్మ ఆకుల పొడి,  దానిమ్మ పూల మొగ్గలు, నల్ల మిరియాలు,  తులసి ఆకులు నీటిలో వేసి  ఐదు నిమిషాలు మరిగించి  ఆ నీటిని  రోజుకి రెండుసార్లు తీసుకుంటే  దగ్గు తగ్గుతుంది.

Leave a Comment

error: Content is protected !!