అనారోగ్యంతో డాక్టర్లను కలిసినప్పుడు ఒక్కోసారి ఎంఆర్ఐ స్కాన్ సూచిస్తారు. అయితే ఈ స్కాన్ వలన ప్రాణాలకు ప్రమాదం ఉందా? ఈ స్కాన్ కి ఎంత ఖర్చు అవుతుంది. దీనివలన కలిగే లాభాలు ఏంటి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అసలు ఎమ ఆర్ ఐ అంటే మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. ఈ ఎం ఆర్ ఐ అనేది శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర శారీరక ప్రక్రియల చిత్రాలను రూపొందించడానికి రేడియోలజీలో ఉపయోగించే మెడికల్ ఇమేజింగ్ టెక్నిక్. MRI స్కానర్‌లు శరీరంలోని అనారోగ్యంతో ఉన్న అవయవాల చిత్రాలను రూపొందించడానికి బలమైన అయస్కాంత క్షేత్రాలు, అయస్కాంత క్షేత్ర ప్రవణతలు మరియు రేడియో తరంగాలను ఉపయోగిస్తాయి.
దీనినే తెలుగులో ఐస్కాంత తరంగాల ఇమేజింగ్ అంటారు. ఎమ్ ఆర్ ఐ వలన శరీరంలోకి ఎటువంటి యంత్రాలను పంపించకుండా శరీరంలో ఉండే అవయవాలు అన్నింటిని క్షుణ్ణంగా చూడగలుగుతారు. శరీరంలో సమస్య ఎక్కడుందో, ఎక్కడైనా కణుతులు వంటివి ఉన్నాయేమో అని తెలుసుకోవడానికి, శరీరంలో ఏ అవయవం ఎంత చురుగ్గా పని చేస్తుందో తెలియడానికి, తీసుకున్న మందులు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ ఎమ్మారై చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎంఆర్ఐ స్కాన్ ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఈ స్కాన్ చేసేముందు డాక్టర్లు మనం వేసుకున్న బట్టలు తీసేసి హాస్పిటల్ గౌన్ వేసుకోమంటారు.
ఎందుకంటే మన బట్టలులో ఉండే మెటల్ వంటివి ఐస్కాంత తరంగాలకు ఆకర్షితమై వేడికి కరుగుతాయి. ఇవి శరీరానికి అంటుకుపోతాయి. అలాగే శరీరంపై ఉండే బంగారం, వాచ్ వంటి వాటిని కూడా ముందుగానే తీసేస్తారు. ఆపరేషన్ వంటివి చేసేటప్పుడు బ్రెయిన్ మ్యాపింగ్ వంటివి ఎంఆర్ఐ స్కాన్ ద్వారా చేస్తుంటారు. స్కానింగ్ చేసేముందు డాక్టర్కి చెప్పవలసిన కొన్ని విషయాలు మీరు గర్భవతి అయితే తప్పకుండా డాక్టర్ కి ఆ విషయం చెప్పాలి. ఎందుకంటే చాలా ప్రభావంతమైన ఐస్కాంత కిరణాలు శరీరంపై పడతాయి. ఇది శిశువు ఆరోగ్యానికి ఇబ్బంది కలుగ చేయవచ్చు. అలాగే శరీరం పై పచ్చబొట్లు, శరీరంలో రాడ్లు, పంటికి ఏదైనా మెటల్ ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు డాక్టర్ కి తప్పకుండా చెప్పాలి. ఇలా ముందుగానే చెప్పడం వలన మీ శరీరానికి తగినట్టు స్కానింగ్ చేస్తారు.
స్కానింగ్ చేసుకునే నాలుగు గంటల ముందు నుండి ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. స్కానింగ్ చేసేటప్పుడు శబ్దాలు వస్తుంటాయి. అవి మనకు వినిపించకుండా హెడ్ సెట్ పెడతారు. ఈ ప్రక్రియ 30 నుండి 90 నిమిషాల వరకు కొనసాగుతుంది.
ఇక ఈ ఎమ్మారై స్కాన్ చేయడానికి పదిహేను వందల నుండి 25 వేల వరకు ఖర్చవుతుంది. మనం ఏ అవయవానికి చేస్తున్నాం, ఎటువంటి హాస్పిటల్లో చేస్తున్నాం అనే దానిపై రేటు ఆధారపడి ఉంటుంది. ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవలసి వస్తే మొత్తం శరీరానికి చేయించుకోవడం వలన శరీరంలో మనకి డాక్టర్లకి తెలియని అనారోగ్యాలు ఉంటే బయటపడతాయి. సమయానికి చికిత్స తీసుకోవచ్చు.