unkown health benefits of jaggery

బెల్లం తిన్న వెంటనే వేడినీళ్ళు తాగితే మీ శరీరంలో ఏం జరుగుతోంది తెలిస్తే ఆశ్చర్య పోతారు. ఇది నిజం

మన సాంప్రదాయ వంటల్లో బెల్లం పురాతన కాలంనుండి  తీపికోసం ఉపయోగిస్తుంటాం. అలాంటి బెల్లాన్ని ఉదయాన్నే పరగడుపున తిని దానితో పాటు గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడంవలన అది  మన శరీరంలో ఎన్నో రోగాలను నయంచేస్తుంది.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే శరీర పనితీరును మెరుగుపరిచి మెటబాలిజం రేటును వృద్ధి చేస్తుంది. 

బెల్లంలో విటమిన్ సి, పొటాషియం, ఐరన్, విటమిన్ బి1, బి6, కాల్షియం, మెగ్నీషియం  వంటి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కేలరీలను కరిగించడంలో కూడా సహాయపడతాయి. ముఖ్యంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారు బెల్లం తిని వేడినీరు తాగడంవలన మంచి  సత్పలితాలు చూస్తారు. ఈ రెండింటి కలయిక కిడ్నీలలోని రాళ్ళను కరిగిస్తుందని రుజువయింది. 

అలాగే చర్మసమస్యలు కలవారు పిగ్మెంటేషన్, మచ్చలు, మొటిమలు, చర్మం పాలిపోయి కాంతిని కోల్పోయిన వారు కూడా ఉదయాన్నే పరగడుపున బెల్లం తిని నీరుతాగడం వలన  రక్తం ఫ్యూరిఫై అయి రెట్టింపు కాంతివంతంగా మారతారు. అలాగే రక్తం శుద్ధి కావడం వలన చర్మాన్ని ఆరోగ్యంగా మార్చుతుంది. కడుపులో గ్యాస్, ఎసిడిటీ, మలబద్దకంతో బాధపడేవారు రాత్రిపూట బెల్లం తిని గోరువెచ్చని నీటిని తాగడంవలన ఉదయానికి వాటినుంచి మంచి రిలీఫ్ ఉంటుంది.

నిద్రలేమి లేదా నిద్రలో గురకతో బాధపడుతుంటే కూడా ఈ బెల్లం, వేడినీరు చిట్కా పనిచేస్తుంది. బెల్లం యాంటీ ఆటిజం ఏజెంట్గా  పనిచేస్తుంది. బెల్లం నిద్ర రావడానికి సహయం చేయడంతో పాటు మనసుకు ప్రశాంతతనిచ్ఛి నిరాశ నిస్పృహలను తగ్గిస్తుంది. ఏదైనా స్వీట్ల లో చక్కెర బదులు బెల్లం ఉపయోగించవచ్చు. ఎందుకంటే చక్కెర వలన ఉపయోగం ఏమీ లేకపోగా బెల్లం కంటే ఎక్కువగా కేలరీలను కలిగి ఉండి అధికబరువు, అనేక ఇతర ఆరోగ్య  సమస్యలకు కారణమవుతుంది. 

స్వీట్లు తయారు చేసేటప్పుడు పంచదార బదులు బెల్లం వాడటం ఆరోగ్యానికి చాలా మంచిది. బెల్లం వలన పళ్ళు, చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటే చక్కెరవలన దంతాలు మరియు నోటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.  బెల్లంతో పాటు యాలకులు కలిపి తినడం వలన నోటి దుర్వాసన, నోటిలో ఏర్పడే బాక్టీరియా దూరమవుతుంది. బెల్లంలో ఉండే ఇనుము పుష్కలంగా ఉండడం వలన  రక్తహీనత, ఎనీమియా తగ్గి శరీరంలో రక్తం స్థాయిలు పెరుగుతాయి.

బెల్లంలో ఉండే కాల్షియం, ఐరన్ వలన ఎముకలు బలంగా అవడంతో పిల్లలు ధృడంగా తయారవుతారు. బెల్లం శరీరాన్ని డీటాక్సిఫై చేసి కాలేయంలో చేరిన విషపదార్థాలను బయటకు పంపేస్తుంది. బెల్లంలో  ఉండే జింక్, విటమిన్ సి  రోగనిరోధక శక్తిని పెంచి  జలుబు, దగ్గులకు గురికాకుండా చూస్తుంది. బెల్లం వేడినీరు తీసుకోవడం వలన శరీరంలో శక్తి స్థాయిలను పెంచి నీరసం, అలసటలకు దూరంచేస్తుంది.

Leave a Comment

error: Content is protected !!